అధికారంలో ఉండగా.. తనకు తిరుగులేదని.. తన మాటకు ఎదురులేదని బీరాలు పలికి.. చెలరేగిపోయిన అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇప్పుడు వాస్తవాలు గుర్తుకు వస్తున్నాయి. వాస్తవం తెలిసి వస్తోంది. అధికారం కోల్పోయాక.. తన పరిస్థితి ఏంటో ఆయనకు తెలిసి వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన కాళ్ల బేరానికి వస్తున్నాయి. “తాడిపత్రిలోకి అనుమతించండి ప్లీజ్” అంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
2019లో తొలిసారి తాడిపత్రిలో వైసీపీ తరఫున పెద్దారెడ్డి విజయం దక్కించుకున్నారు. దీనికితోడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు తిరుగులేదన్నట్టుగా పెద్దారెడ్డి చెలరేగిపోయారు. టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో వివాదానికి దిగారు.జేసీ కుటుంబాన్ని ఎంత వేధించాలో అంతా వేధించారు. వారి ట్రాన్స్ పోర్టు వ్యాపారాన్ని దెబ్బతీసేలా కూడా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. జైల్లో కూడా పెట్టించారు.
ఏకంగా జేసీ ఇంటికి వెళ్లి.. బెదిరింపులకు పాల్పడ్డారు. సవాళ్లు రువ్వారు. అయితే.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్టుగానే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం మరోసారి విజయం దక్కించుకుంది. అయినా కూడా తనదే పైచేయి అన్నట్టుగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా పెద్దారెడ్డి దూకుడుగానే వ్యవహరించారు. తాడిపత్రిలో తన పరివారంతో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తీవ్ర హింస కూడా చెలరేగింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు కేతిరెడ్డిపై బహిష్కరణ వేటు వేశారు. నియోజకవర్గంలోకి రాకుండా ఆయనపై ఆంక్షలు విధించారు. దాదాపు నెల రోజుల నుంచి కేతిరెడ్డి నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆయన దిగివచ్చారు. అనంతపురం ఎస్పీ జగదీష్ ను కలిసిన పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించాలని విన్నవించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని, ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రికి అనుమతించాలని ఆయన వేడుకున్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా.. ఒకప్పుడు విర్రవీగిన కేతిరెడ్డి ఇప్పుడు కాళ్లబేరానికి రావడం ఆసక్తిగా మారింది.
This post was last modified on September 30, 2024 3:50 pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…