Political News

వైసీపీ నేత‌లు ల‌క్కీ… సుప్రీంకోర్టు బెయిల్

వైసీపీ నేత‌ల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. 2021లో జ‌రిగిన టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో వారికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. కొన్ని ష‌ర‌తులు విధించింది. పోలీసులు విచార‌ణ‌కు పిలిచిన‌ప్పుడు అందుబాటులో ఉండాల‌ని పేర్కొంది. అదేవిధంగా అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ల ను పోలీసుల‌కు ఇవ్వాల‌ని.. దేశం విడిచి వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. ఈ కేసుకుసంబంధించిన విష‌యాల‌ను బ‌య‌ట కు వెల్ల‌డించరాద‌ని కూడా పేర్కొంది.

ఎవ‌రెవ‌రికి ఊర‌ట‌..

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడులు చేశార‌న్న కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్న ఎమ్మె ల్సీ త‌ల‌శిల ర‌ఘురాం, మాజీ మంత్రి జోగి ర‌మేష్‌, మ‌రో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయ‌కులు గ‌వాస్క‌ర్‌, విజయవాడ‌కు చెందిన యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ త‌దితురుల‌కు బెయిల్ ఇచ్చింది. కొన్ని ష‌ర‌తులు విధించింది. దీంతో ఈ కేసులో ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న కొంద‌రు నాయ‌కులు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై మూక‌దాడికి దిగారు.

టీడీపీ నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభి.. అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన అభ్యం త‌రక‌ర వ్యాఖ్య‌లు.. దుమారం రేపాయి. దీనికి ప్ర‌తిగా వైసీపీ నాయ‌కులు పార్టీ కార్యాల‌యంపై దాడికి దిగారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య పెద్ద దుమారం రేగింది. ఇక‌, ఆ త‌ర్వాత ప‌ట్టాభిని అభ్యంత‌ర వ్యాఖ్య‌ల‌పైనే పోలీసులు అరెస్టు చేసి.. థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని టీడీపీ నాయ‌కులు అప్ప‌ట్లో ఆరోపించారు.

ఇక‌, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. అప్ప‌టి దాడి కేసును తిర‌గ‌దోడి.. నేత‌ల‌ను అరెస్టు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 12 మంది వైసీపీ చోటా నేత‌లు జైల్లో ఉన్నారు. బాప‌ట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌, విజ‌య‌వాడ న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ శైల‌జ‌ భ‌ర్త అవుతు శ్రీనివాస‌రావు కూడా జైల్లోనే ఉన్నారు. వీరిని ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. వీరికి సంబంధించిన బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉంది.

This post was last modified on September 13, 2024 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

13 minutes ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

25 minutes ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

1 hour ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

1 hour ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

2 hours ago

తెలంగాణ కాంగ్రెస్ పనితీరుపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వ‌చ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు అలెర్టుగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు.…

2 hours ago