టీడీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గం ప్రజలతో భేష్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తు తం ఆయన అమెరికాలో ఉన్నారు. అయినప్పటికీ.. ఇక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
తన టీంను ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయన.. అమెరికాలో ఉంటూనే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 4న రాము అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇది ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ కావడంతో రద్దు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
అయితే.. అప్పటికి బాగానే ఉన్న గుడివాడ పట్టణం.. ఆ మరుసటి రోజు నుంచి కొంత వరదలకు ప్రభావితమైంది. అయినప్పటికీ.. వెనిగండ్ల రాము సమర్థవంతంగా ఇక్కడ పనులు చక్కబెట్టారు.
లోతట్టు ప్రాంతాలైన గుడివాడ బస్ స్టాండ్ పరిధిలోని వాసులను స్థానిక కల్యాణ మందిరానికి తరిలించారు. అందరికీ ఆహారం, తాగునీటిని ఏర్పాటు చేశారు. సామాన్లను కూడా కొందరివి సురక్షిత ప్రాంతానికి చేర్చినట్టు రాము అనుచరులు సత్యనారాయణ చౌదరి, వికాస్ తెలిపారు.
ఇక, రాము లేడన్న మాటే కానీ.. ఇక్కడ అందుతున్న సహాయక చర్యలకు లోటు రాకుండా చూసుకున్నట్టు స్థానికు లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ నాయకుల జాడ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎవరూ వైసీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇదిలావుంటే.. అమెరికాలో పర్యటిస్తున్న రాము.. డల్లాస్‌లోని మహత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించారు. ఇది అమెరికాలోనే అతి పెద్ద మెమోరియల్ కావడం గమనార్హం.
అదేసమయంలో ఎన్నికల వేళతనకు ఆప్తులుగా నిలిచిన ఎన్నారైలను కూడా రాము కలుసుకున్నారు. వారికి ధన్య వాదాలు తెలిపారు. అయితే.. గుడివాడలో చిత్రం ఏంటంటే.. స్థానిక ఎమ్మెల్యే లేని సమయంలో ఉన్న గ్యాప్‌ను వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వినియోగించుకోకపోవడమే.
నిజానికి ఇంత విపత్తు సంభవిస్తే.. నాని కానీ, ఆయన అనుచరులు కానీ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మరి కారణాలు ఏమైనా.. కొడాలి ప్లేస్‌ను రాము ఫుల్లుగా ఆక్యుపై చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on %s = human-readable time difference 5:13 pm
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…
విజన్ 2047 లక్ష్యంగా వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని…