కొన్నాళ్ల కిందట రిటైర్ అయిన.. సీనియర్ ఐపీఎస్ అధికారి పరారీలో ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అంటే.. ఇది బహిరంగంగా ప్రకటించకపోయినా.. అంతర్గతంగా పోలీసులు చెబుతున్న మాట. ఆయన కోసం.. ఇప్పుడు పోలీసులు నలుచెరగులా వెతుకుతున్నారు. ఎందుకు? ఏమిటి? అంటే.. దీని వెనుక చాలానే ఉందని కూడా అంటున్నారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజును నిర్బంధించిన విషయం రెండు తెలుగురాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించింది.
దీనిలో అనేక మంది ఐపీఎస్‌ల పాత్ర ఉందని రఘురామ అప్పట్లోనే వాదించారు. వీరిపై ఆయన కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. నిర్బంధించడం వరకు ఓకే.. కానీ, అప్పటి సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని.. తన అరికాళ్లు వాచేలా కొట్టారన్నది రఘురామ వాదన. ఈ క్రమంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ పాల్. ఈయనపై రెండు నెలల కిందట గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పరారీలో ఉన్నారని డీజీపీకి అందించిన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. తనను అరెస్టు నుంచి కాపాడాలంటూ.. విజయ్ పాల్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇంతలోనే ఆయన ఇంటికి తాళం వేయడంతో ఇక, పరారీలో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు.
దర్యాప్తుకు సహకరించని వాళ్లు ముందస్తు బెయిల్ కు అనర్హులని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయ వాది సిద్ధార్థ లూథ్రా చేసిన వాదనలను హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ఈ కేసులో బాధితుడిగా తన కు ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేసిన రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామాల క్రమంలో విజయ్ పాల్ కనిపించకుండా పోవడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 12, 2024 11:29 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…