ఒక ఓటమి నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాలి. ఒక మైనస్ నుంచి అనేక మార్పులు చోటు చేసుకోవాలి. ఇది రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. పైగా.. ప్రజలకు ఎంతో చేశానని చెప్పినా.. ఘోరంగా ఓడిపోయిన జగన్.. అండ్‌కో.. మరింత ఆత్మ విమర్శ చేసుకోవాలి. కారణాలు వెతుక్కోవాలి. లేదా.. కళ్ల ముందు కనిపిస్తున్నవాటిని ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి. కానీ, ఆదిశగా అధినేత కానీ.. నాయకులు కానీ.. అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు.
రాజకీయాల్లో కావాల్సింది.. అనునయం. అప్పటి వరకు రెచ్చిపోయిన వారు కూడా.. ఎన్నికలకు ముందు చప్పబడ్డారు. జనం నాడిని తెలుసుకున్నారు. వారికి అనుకూలంగా వ్యవహరించారు. ఫలితం కళ్ల ముందు కనిపించింది. మరి సుదీర్ఘ రాజకీయ జీవితం.. అంటే.. కనీసంలో కనీసం 25 సంవత్సరాల రాజకీయ భవితవ్యం ఉన్న జగన్ మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. నోరు కుదరడం లేదు.. నాణ్యంగా ప్రజలను మెప్పించలేకపోతున్నారు కూడా.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి ఆయన మెరుగైన ఫలితం అందుకునే అవకాశం ఉన్నా.. ఎక్కడో తడబడుతున్నారు. ఇంకా.. బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. మంచి ఎంత చేసినా.. చెడు అనే చిన్న ఉప్పు గల్లు.. కుండెడు పాలను కబళించిన చందంగానే.. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి. “మేం వస్తే.. మొత్తాన్నీ లోపలేస్తాం” అంటూ.. ఆయన టీడీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. జగన్ మారలేదు.. అన్న మాటను మరోసారి బలపరుస్తున్నాయి.
ప్రజలకు అల్టర్నేటివ్ ఉంది. అనేక మంది నాయకులు ఉన్నారు. కానీ, జగన్‌కు ఆల్టర్నేటివ్ లేదు. ఒక్క ప్రజలు తప్ప. అలాంటిది వారిని మచ్చిక చేసుకుని.. నాలుగు మంచి మాటలతో మెప్పించే ప్రయత్నం అయితే ఆయన చేయడం లేకపోతున్నారు. కస్సుబుస్సులు.. బెదిరింపులు.. ఘీంకరింపులు.. వార్నింగు లు.. ఒక్కనాటికి కూడా ఓటు బ్యాంకును చేరువ చేయలేవు. బెదిరించి భయ పెట్టేవాడు.. బంగారం ఇచ్చినా ప్రజలు తీసుకోరు. మంచిగా మాట్లాడేవాడు గంజిపోసినా చాలనుకుంటారు. ఇప్పుడు దీనిని బట్టి జగన్ తనను తాను మార్చుకోకపోతే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం ఖాయం.
This post was last modified on September 12, 2024 11:24 am
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…