Political News

ఆ ఘ‌ట‌న న‌న్ను క‌లిచి వేసింది: చంద్ర‌బాబు

తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి నుంచి జీడిపిక్కల లోడ్‍తో వెళ్తున్న‌ లారీ.. అర్థరాత్రి దేవ‌ర‌ప‌ల్లి వ‌ద్ద బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో లారీపై ప్ర‌యాణిస్తున్న కూలీలు.. లారీ కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే సీఎం చంద్ర‌బాబు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

రోడ్డు ప్ర‌మాదంలో ఏడుగురు మృతి చెందడంపై చంద్ర‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. “లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం న‌న్ను ఎంతో కలచివేసింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాం” అని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఇదేస‌మ‌యంలో క్ష‌త‌గాత్రుల‌కు అన్ని విధాలా మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను కూడా ఆయ‌న ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం అన్నారు.

కాగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దేవ‌ర‌ప‌ల్లి రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిలకావారిపాకలు దగ్గర చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవడం బాధాకరమ‌ని పేర్కొన్నారు. “కష్ట జీవులు ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రభుత్వం ఆ కుటుంబాలను తగిన విధంగా ఆదుకొంటుంది” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి జీడిగింజల లోడుతో నిడదవోలు మండలం తాడిమల్లకు ఓ లారీ వెళ్తోంది. అయితే.. మంగ‌ళ‌వారం రాత్రి స‌మ‌యంలో చినుకులు ప‌డుతుండ‌గా.. దారి స‌రిగా క‌నిపించ‌లేదు. దీంతో చిన్నయగూడెం శివారులో అదుపు తప్పి పంట కాలువలోకి వాహ‌నం బోల్తా కొట్టింది. ఆ స‌మ‌యంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణం చేస్తున్నారు. వీరంతా కూలీలే. జీడీ గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. అయితే.. కేబిన్లో ఉన్న డ్రైవ‌ర్ స‌హా ముగ్గురు సురక్షితంగా ఉన్నారు.

This post was last modified on September 11, 2024 9:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబు, జగన్… విదేశాలకు ఇద్దరూ ఒకేసారి

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……

5 hours ago

భన్సాలీతో బన్నీ – ఏం జరుగుతోంది ?

సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…

11 hours ago

ప‌వ‌న్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ‌.. !

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్ప‌లు మామూలుగా ఉండ‌డం లేదు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా..…

12 hours ago

తిరుప‌తి తొక్కిస‌లాట‌: జ‌గ‌న్ కామెంట్స్ ఇవే!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌కు భ‌య‌ప‌డుతోంద‌ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌కు భ‌య‌ప‌డుతున్న…

13 hours ago

ఒకే చోట ప‌వ‌న్‌-జ‌గ‌న్ ఎదురు పడ్డ వేళ‌!

ఏపీ రాజ‌కీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్య‌వ‌హ‌రించే జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌లు…

13 hours ago

క్షమించండి… పబ్లిక్ గా సారీ చెప్పిన పవన్

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…

13 hours ago