ఈ నెలలో తన కుమార్తె పుట్టిన రోజు వేడుకల నిమిత్తం లండన్ వెళ్లాలని భావించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు కొంత ఊరట లభించింది. ఆయన పాస్ పోర్టు విషయంలో నెలకొన్న వివాదానికి రాష్ట్ర హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే.. ఈ విషయంలో జగన్ కోరుకున్నట్టుగా అయితే ఆదేశాలు రాకపోవ డం గమనార్హం. కేవలం ఒకే ఒక్క విషయంలో ఆయనకు ఊరట లభించింది.
జగన్ కోరిక-1: తన పాస్ పోర్టును ఒక ఏడాదికే పరిమితం చేస్తూ.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి.. తనకు ఐదేళ్లకు పాస్ పోర్టు ఇప్పించాలని. ఈ విషయంపైనే హైకోర్టు కు వెళ్లారు.
హైకోర్టు ఆదేశం: జగన్ కోరుకున్నట్టుగానే హైకోర్టు ఆదేశాలు వచ్చాయి. ఏడాది కాదు.. మొత్తం ఐదేళ్లకు సరిపోయేలా పాస్ పోర్టును ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
జగన్ కోరిక-2: పాస్ పోర్టు మంజూరు చేసేందుకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన షరతులను తొలగించాలని. ఎలాంటి షరతులు లేకుండా పాస్ పోర్టు మంజూరు చేయాలని.
హైకోర్టు ఆదేశం: ప్రజాప్రతినిధుల కోర్టు విధించిన అన్ని షరతులూ.. కొనసాగుతాయి. ఆ మేరకు పిటిషనర్(జగన్) షరతులు పాటించాలి.
ఏంటా షరతులు?
+ జగన్‌పై నమోదైన పరువు నష్టం కేసు(ప్రస్తుత మంత్రినారాయణ 2021లో దాఖలు చేశారు. ఇది విచారణ దశలోనే ఉంది)కు సంబంధించి రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలి.
+ ఈ పూచీకత్తును జగన్ స్వయంగా కోర్టుకు వచ్చి సమర్పించాలి.
+ పరువు నష్టం కేసులో సమన్లు అందలేదా? అందినా తీసుకోలేదా..? అనే విషయంపై స్వయంగా వివరణ ఇవ్వాలి.
ఫైనల్‌గా: జగన్‌కు ఊరట లభించింది. కానీ, షరతులు మాత్రం వర్తిస్తాయి. దీంతో ఆయన సుమారు 6 సంవత్సరాల తర్వాత.. కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
This post was last modified on September 11, 2024 9:14 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…