తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులు ఆక్రమిస్తే.. చెరసాలేనిన వార్నింగ్ ఇచ్చారు. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారు.. తక్షణం వాటిని విడిచి వెళ్లాలని తేల్చి చెప్పారు. అంతేకాదు.. విడిచి వెళ్లకపోతే.. నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని తెలిపారు. ఆక్రమణలను సహించేది లేదన్నారు. `ఎఫ్‌టీఎల్, నాలా, బఫర్ జోన్‌లను రెగ్యులరైజ్ చేస్తామని.. కొందరు వేచి చూస్తున్నారు. కానీ, అలాంటి ఆశలు ఏమీ లేవు. అలాంటివేమీ చేయబోం“ అని రేవంత్ చెప్పారు.
తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం తెలంగాణ అకాడమీలో ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు పలు విషయాల్లో దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో విచ్చలవిడిగా ఉన్న డ్రగ్స్‌ను, సైబర్ నేరాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
ఇక, ఆక్రమణలు.. హైడ్రా దూకుడుపై మాట్లాడుతూ.. “ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్ రెగ్యులరైస్ స్కీం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తున్నారు. దీనిలో రాజకీయాలు లేవు. కక్ష పూరిత చర్యలు లేవు. చెరువులను ఆక్రమిస్తే ఒప్పుకొనేదే లేదు“ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇక, “సైనిక స్కూల్ తరహాలో పోలీసులకు 50 ఎకరాల్లో పోలీసు రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తాం. ప్రక్షాళన చెయ్యడానికే కొత్తకోటకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేస్తాం. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం“ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
This post was last modified on %s = human-readable time difference 9:07 pm
దగ్గుబాటి రానా అంటే కేవలం నటుడు కాదు. తన తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నిర్మాత కూడా. ఐతే అతను…
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ఒక దశలో ఫిదా, ఎఫ్-2 తొలి ప్రేమ లాంటి హిట్లతో మంచి ఊపు…
వరుణ్ ధావన్, సమంతా జంటగా నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన…
పొరుగింటి పుల్లకూర రుచి అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇది తెలుగు వారికి బాగా నప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి.…
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ సాధించి నలభై రోజుల తర్వాత ఓటిటిలో వచ్చిన దేవర మీద సోషల్ మీడియాలో…
మొత్తానికి లక్కీ భాస్కర్ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన బ్రాండ్ ఇమేజ్ ను మార్చేసుకున్నాడు. మొదట్లో వరుసగా తొలిప్రేమ…