గత వారం రోజులుగా రాజకీయంగా కీలకంగా మారిన ప్రకాశం బ్యారేజీ ఐరన్ బోట్ల వ్యవహారంపై వైసీపీ అధి నేత, మాజీ సీఎం జగన్ తాజాగా స్పందించారు. సీఎం చంద్రబాబు అయితే.. ప్రతి రోజూ దాదాపు ఈ బోట్ల గురించే మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
కృష్ణానదికి వరద ఉధ్రుతి పెరిగిపోయి.. 11 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చిన సమయంలో మూడు ఐరన్ బోట్లు బలంగా బ్యారేజీ వెయిట్స్‌కు గుద్దుకు న్నాయి. దీంతో 67-69 మధ్య ఉన్న వెయిట్ దెబ్బతింది.
దీంతో అలెర్టయిన ప్రభుత్వం వెంటనే దీనికి మరమ్మతులు చేయించింది. అయితే.. ఇలా ఐరన్ బోట్లను వదిలి పెట్టడం.. బ్యారేజీవెయిట్ దెబ్బతినడం వెనుక రాజకీయ కుట్ర ఉందనేది అధికార పార్టీ నాయకు లు చెబుతున్న మాట. దీనిపైనే సీఎం చంద్రబాబు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
వైసీపీ నేతల కుట్ర ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇవి వైసీపీ నేత, ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడికి చెందినవిగా గుర్తించామ ని కూడా చెప్పారు.
అయితే.. అప్పటి నుంచి వైసీపీ తరఫున కౌంటర్ రాలేదు. తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడిన జగన్.. ఈ బోట్ల వ్యవహారంపై మాట్లాడుతూ.. ఇవన్నీ.. టీడీపీ నేతలకు చెందినవేనని చెప్పారు. చంద్ర బాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని.. మూడు నెలల కిందట టీడీపీ గెలిచిన సమయంలో ఈ బొట్లలోనే టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
ఉషాద్రి, రామ్మోహన్ అనే వ్యక్తులు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేత నారా లోకేష్‌కు సన్నిహితులని వ్యాఖ్యానించారు.
ఎన్నారై టీడీపీ నేత బంధువులకు చెందిన బోట్లేనని, టీడీపీ నాయకుడు చిన్నాకు చెందినవేనని చెప్పా రు. ఈ బోట్లన్నీ ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొని వచ్చాయని జగన్ తెలిపారు. అయితే.. దీనిని కూడా రాజకీ యం చేయాలని చూశారని విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన మూడు నాలుగు నెలల తర్వాత కూడా.. ఇంకా బాధ్యత లేదన్నట్టుగా.. విపక్షంవైపే వేళ్లు చూపిస్తున్నారని.. ఇదేం పద్ధతని జగన్ ప్రశ్నించారు. ప్రజల కష్టాలను తీర్చలేక.. ప్రతిపక్షం వైపు నెపం చూపుతున్నారని దుయ్యబట్టారు.
This post was last modified on September 11, 2024 9:13 pm
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని,…
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్‌ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి…
ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని…
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో…
కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని…