కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి.. నేటికి(సెప్టెంబరు 11) 90 రోజులు పూర్తయ్యాయి. సాధారణంగా.. తొలి వంద రోజులు ప్రశాంతంగా జరిగిపోవాలనిఏ ప్రభుత్వమైనా కొరుకుంటుంది. ఫీల్‌గుడ్ భావన లభించాల నే ఆశిస్తుంది.
వచ్చిన తొలి రోజుల్లోనే ప్రభుత్వం ఏదైనా చేయడం ద్వారా ప్రజల దగ్గర మార్కులు కొట్టే యాలని చూస్తుంది.తద్వారా.. తర్వాత పాలన ఎలా ఉన్నా.. తొలి 100 రోజుల పాలనను చివరి వరకు చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంది.
కానీ, చిత్రంగా గతంలో వైసీపీ సర్కారుకు.. 200 రోజుల తర్వాత.. కరోనా రూపంలో భారీ విపత్తు ఎదురొచ్చిం ది. అప్పటి వరకు సచివాలయాల ఏర్పాటు, వలంటీర్ల నియామకం.. వంటి కార్యక్రమాలతో ఉన్న సర్కారు కు కరోనా రూపంలో వచ్చిన పెద్ద విపత్తు అగ్ని పరీక్షగా మారింది.
ఇది ఒకరోజు రెండు రోజుల కాదు.. ఏకం గా ఏడాదిన్నర పాటు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని నుంచి కోలుకునేలోగానే.. వరదలు.. ఎల్జీ పాలిమర్స్ ఘటన వంటివి ఇబ్బంది పెట్టాయి.
ఇక, ఇప్పుడు కూటమి సర్కారుకు కూడా ఇదే తరహా ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆది నుంచి కూడా.. సర్కారుకు ఇబ్బందులు తప్పలేదు. అనకాపల్లి ఫార్మా కంపెనీలో తలెత్తిన విపత్తు పదిమందికి పైగా ప్రాణాలు తీసింది. మరోవైపు.. వైసీపీ వర్సెస్‌టీడీపీ కుమ్ములాటతో పదుల సంఖ్యలో నాయకులు చనిపోయారు. ఈ సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలోనే విజయవాడకు వరద వచ్చింది. ఇది పది రోజులుగా వెంటాడుతూనే ఉంది.
ఇంతలోనే విశాఖ, విజయనగరం, కాకినాడ సహా.. పలు ప్రాంతాల్లో వరద బీభత్సం.. తుఫాను వంటివి ఇబ్బందిగా మారాయి. దీంతో తొలి 90 రోజులుకూడా కూటమి సర్కారు విపత్తులతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు చూస్తే.. రెండు కీలక పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.
పెంచిన పింఛన్లను ఇవ్వడం.. అన్న క్యాంటీన్లను ప్రారంభించడం. ఇక, మిగిలిన వాటికి.. రూపకల్పన చేసే దిశలో ఈ చిక్కులు రావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. తొలి 90 రోజులు కూటమి సర్కారు విపత్తుతోనే యుద్ధం చేయాల్సి వచ్చిందనేది వాస్తవం.
This post was last modified on September 11, 2024 9:11 pm
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…