మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఇదేసమయం లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైనా ఆయన ఫైరయ్యారు.
రేవంత్‌రెడ్డి సర్కారుకు కేసీఆర్‌ను డీల్ చేయడం చేతకావడం లేదని.. అదే తాము అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబానికి అంకుశం సినిమాలో మాదిరిగా చుక్కలు చూపించి ఉండేవారమని చెప్పారు. “రేవంత్‌రెడ్డి తోపు అనుకున్నం. కానీ, ఆయనకు చేతకావడం లేదని అర్థమైంది. కేసీఆర్‌ను ఎప్పుడో జైల్లో పెట్టాల్సింది. కానీ, ఆయన చేయలేక పోతున్నడు“ అని బండి వ్యాఖ్యానించారు.
తాజాగా బండి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌సర్కారు చేతకాని తనం వల్లే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అదే రాష్ట్రంలో బీజేపీ సర్కారు వచ్చి ఉంటే ఆయనకు చుక్కలు కనిపించేవని వ్యాఖ్యానించారు.
తెలంగాణకు పట్టిన దశమ గ్రహం ఏదైనా ఉంటే అది కేసీఆరేనని బండి నిప్పులు చెరిగారు. “నాపైనా.. మాపార్టీ నాయకులపైనా కేసీఆర్ నాన్ బెయిలబుట్ కేసులు పెట్టాడు. రౌడీషీట్లు తెరిచాడు. ఇలాంటి వాడిని ఎప్పుడో జైల్లో పెట్టుండాలి“ అని అన్నారు. కవితకు బెయిల్ విషయంపై స్పందిస్తూ.. “ఇలాంటి విషయాల్లో కేసీఆర్ ఆరితేరిన వ్యక్తి.. ఎక్కడ ఎవరి కాళ్లకు మొక్కాలో ఆయనకు బాగా తెలుసు“ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్ నవగ్రహ యాగాలు చేయడంపై స్పందిస్తూ.. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే.. ఈయన రాజకీయ కష్టాల్లో ఉన్నారని వ్యాఖ్యా నించారు. అందుకే యాగాలు చేస్తున్నడని అన్నారు. “కేసీఆర్‌కు ప్రజలు నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు. అసలు కేసీఆర్ బయటకే రావడం లేదు“ అని వ్యాఖ్యానించారు.
ఆరు గ్యారెంటీలు ఏమైనవి? అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు. వాటిని దృష్టి మళ్లిం చేందుకు హైడ్రాతో డ్రామాలు ఆడుతున్నాడని వ్యాఖ్యానించారు. “చెరువులను ఆక్రమించుకున్నరని కూల్చుతున్నరు. మరి ఈ అనుమతులిచ్చిన వారి సంగతేంటి. వారినేం చేస్తరు? ఇదంతా డ్రామా.. హామీలపై ప్రశ్నిస్తారనే ఇలా భయ పెడుతున్నరు“ అని బండి వ్యాఖ్యానించారు.
This post was last modified on September 11, 2024 9:09 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…