Political News

ఆయ‌నే రాజు.. ఆయ‌నే మంత్రి

యాట్టిట్యూడ్‌.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తున్న మాట‌. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో ఆ పార్టీ నేత‌లు ఏ ఇద్ద‌రు క‌లిసినా.. “ఆయన యాట్టిట్యూడ్ ఏంటో నాకస్స‌లు అర్ధం కావ‌ట్లేదు” అనే మాటే వినిపిస్తోంది.

ఇదే మాట అధికార పార్టీ నాయ‌కులు జ‌గ‌న్ గురించి చ‌ర్చించిన ప్ర‌తిసారీ చెబుతున్నారు. జ‌గ‌న్ యాట్టిట్యూడే అంత‌! అనే మాట వీరి మ‌ధ్య కూడా వినిపిస్తోంది. ఇంత‌కీ అస‌లు ఏంటీ జ‌గ‌న్ యాట్టిట్యూడ్‌? ఎందుకింత‌గా చ‌ర్చకు వ‌చ్చింది?

జ‌గ‌న్ ఆది నుంచి కూడా త‌న పార్టీని కార్పొరేట్ సంస్థ‌గానే భావిస్తారు. త‌ను పెట్టుకున్న పార్టీ.. త‌న మాటే శాస‌నం.. అనే మాటే ఉంటుంది త‌ప్ప‌.. వేరే మాటే ఉండ‌దు. ఇది వాస్త‌వం కూడా. కాంగ్రెస్ నుంచి విడి వ‌డి.. సొంత‌గా జ‌గ‌న్ పార్టీ పెట్టుకున్నారు. దీనిలో ఆయ‌నే రాజు.. ఆయ‌నే మంత్రి. అప్పుడ‌ప్పుడు… ఏవైనా న‌చ్చితే మాత్ర‌మే ఇత‌రుల అభిప్రాయాల‌ను ఆయ‌న తీసుకుంటారు. లేక‌పోతే.. త‌ను పెట్టుకున్న సంస్థ‌ల నుంచిత‌న‌కు న‌చ్చిన విధంగానే ముందుకు సాగుతారు.

ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు పింఛ‌న్‌ను రూ.4000ల‌కు పెంచుతాన‌ని చెప్పారు. దీనిపై కొంద‌రు కీల‌క వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌కు చెప్పారు మ‌నం కూడా పెంచుదామ‌న్నారు. కానీ, ఆయ‌న త‌న వైఖ‌రినే ప్ర‌ద‌ర్శించారు.

ఇక‌, నాయ‌కుల‌ను మార్చే విష‌యంలోనూ కొంద‌రు వ‌ద్ద‌న్నారు. గెలిచే గుర్రా లేన‌ని చెప్పారు. కానీ.. జ‌గ‌న్ త‌న వైఖ‌రినే అమ‌లు చేశారు. ఫలితం ఎలా వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. అయినా.. ఆయ‌న త‌న యాట్టిట్యూడ్‌ను మార్చుకోలేక పోయారు.

తాము మంచి చేసి ఓడామ‌ని ఒక నినాదం ఇచ్చారు. ఇది అంద‌రికీ న‌చ్చ‌లేదు. ఇక‌, పార్టీ నుంచి వెళ్లిపోయే నేత‌ల‌ను క‌నీసం పిలిచి మాట్లాడాల‌ని.. కొంద‌రు నాయ‌కులు సూచించారు. కానీ, ఇది జ‌గ‌న్ యాటిట్యూడ్‌కు వ్య‌తిరేకం. నేను పెట్టుకున్న పార్టీ.. వాళ్లు వ‌చ్చారు అవ‌కాశం ఇచ్చాను. వారు వెళ్తే పోనీ.. వేరేవారికి అవ‌కాశం ఇస్తాను.. అన్న ధోర‌ణిలోనే ఉన్నారు. మ‌రోవైపు.. గ‌త ప్ర‌భుత్వం త‌ప్పులు అంటూ.. ఏం జ‌రిగినా చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై నెట్టేస్తున్నారు.

దీనిని బ‌లంగా ఎదిరించాల‌ని అన్నా.. నాయ‌కుల మాట జ‌గ‌న్ వినిపించుకోవ‌డం లేదు. ఇదీ ఆయ‌న యాట్టిట్యూడేన‌ని అంటున్నారు. అంతా ప్ర‌జ‌లే తెలుసుకుంటార‌ని ఆయ‌న చెబుతున్నారు. దీంతో అస‌లు జ‌గ‌న్ యాట్టిట్యూడ్ ఏంటో అర్థం కాక‌.. వైసీపీ నేత‌లు జుట్టు పీక్కుంటున్నారు.

This post was last modified on September 10, 2024 5:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేసీఆర్ బయటకొచ్చారు!.. అసెంబ్లీలో సమరమే!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు వాడీవేడీగా సాగేలా కనిపిస్తున్నాయి.…

53 minutes ago

జగన్ వి చిన్నపిల్లాడి చేష్టలు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు…

57 minutes ago

ఏ ఎమ్మెల్యే ఎటు వైపు? దాసోజు గెలిచేనా?

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక‌ల పోలింగ్ ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ ఎన్నిక‌లు ఏపీలో మాదిరిగా…

2 hours ago

చంద్రబాబుతో విభేదాలపై సోము ఓపెన్ అప్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో రాజకీయ బంధాలపై బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తరఫున సోమవారం…

2 hours ago

చెత్త సినిమాల కంటే కంగువ నయమా

సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్న కంగువకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి…

2 hours ago

SSMB 29 – కాశి నుంచి అడవుల దాకా

ఇండియా వైడ్ విపరీతమైన అంచనాలు మోస్తున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ని దర్శకుడు రాజమౌళి నిర్విరామంగా చేస్తున్నారు. ప్రధాన క్యాస్టింగ్…

3 hours ago