విజయవాడలో ఒక వైపు వరదలు.. మరోవైపు విశాఖలో పెరుగుతున్న వర్షాలు.. వెరసి సీఎం చంద్రబాబు కు టెన్షన్ పెరుగుతోంది. మరి అలాంటిది.. ఆయన ఈ విపత్కర సమయం మురిసిపోవడం ఏంటి? అనే సందేహాలు వ్యక్తమవుతాయి. అయితే.. ఆయన నిజంగానే మురిసిపోయారు.. తన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి వారినే నేనుకోరుకుంటున్నాను
అని ప్రత్యేకంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరి చంద్రబాబును అంతగా కదిలించిన సన్నివేశం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
విజయవాడలో గత వారం రోజులుగా వరద బీభత్సంతో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు సాయం అందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అనేక మంది సంపన్నులు, వ్యాపార వేత్తలు.. పారిశ్రామిక వేత్తలు కూడా ముందుకు వచ్చారు. రూ. కోట్ల రూపాయల సాయం చేస్తున్నారు. అయితే.. బు డిబుడి అడుగులు వేసే చిన్నారుల నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల వరకు.. తమకు తల్లిదండ్రులు ఇచ్చిన ప్యాకెట్ మనీని దాచుకోకుండా.. వరద బాధితులకు సాయం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని కోట్ చేసిన చంద్రబాబు.. ఇది తనను ఎంతో మురిసిపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడుమండ లం, పడమర విప్పర్రు గ్రామంలోని ఓ స్కూల్ చిన్నారులు.. విజయవాడ వరద బాధితులకు సాయం అందించారు. ఇంట్లో తల్లిదండ్రులు వారికి ఇచ్చిన పాకెట్ మనీని కూడా వారు వరద సాయం కోసం అందించారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే చంద్రబాబు మురిసిపోయారు.
విద్యార్తుల్లో చిన్ననాటి నుంచే ఇలాంటి అత్యున్నత విలువలు పెంపొదిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా. అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలన్న గుణాన్ని నేర్పడం సంతోషకర విషయం. మానవత్వంపై విశ్వాసం, భవిష్యత్తుపై నమ్మకం పెంచుతాయి. ఉత్తమ పౌరులను ఈ సమాజానికి అందిస్తాయి
అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.