Political News

ఔనా.. నిజ‌మేనా? వైసీపీ మాజీ మంత్రికి జ‌ర్న‌లిస్టు కోటాలో ఇల్లు!

తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను మంజూరు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి స్వ‌యంగా కొంద‌రికి ఇళ్ల స్థ‌లం కేటాయింపు ప‌త్రాల‌ను అందించారు. ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం.. “జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ”లో సభ్యులుగా ఉన్న జ‌ర్న‌లిస్టుల‌కు పత్రాలను అందజేశారు. అయితే.. ప్ర‌బుత్వం ప్ర‌క‌టించిన ఈ జాబితాలో వైసీపీ ఏపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కుర‌సాల క‌న్నబాబు పేరు ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఇళ్ల స్థ‌లాల‌కు అర్హులైన జ‌ర్న‌లిస్టుల జాబితాను స‌ర్కారు విడుద‌ల చేసింది. ఈ జాబితాలో క‌న్న‌బాబు పేరు ఉండ‌డం సంచ‌ల‌నంగా మారింది. నెంబ‌రు 280 ద‌గ్గ‌ర “కుర‌సాల క‌న్న‌బాబు-చీఫ్ రిపోర్ట‌ర్‌” అని ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అస‌లు ఈ జాబితా ఎప్పుడు త‌యారు చేశారు? ఏ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేశారు? అనేది చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇది క‌నుక నిజ‌మే అయితే.. జాబితా మొత్తం లోప‌భూయిష్ట మేన‌ని ప‌లువురు జ‌ర్న‌లిస్టులు వాపోతున్నారు. అన‌ర్హుల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టేన‌ని చెబుతున్నారు.

కుర‌సాల క‌న్నాబాబు గ‌తంలో ఓ ప్ర‌ధాన పత్రికలో ప‌నిచేశారు. అయితే.. ఇది 2005కు ముందు ముచ్చ‌ట‌. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఇటీవ‌ల కాలంలో కూడా ఈ విష‌యాలు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. అప్ప‌ట్లోనే తాను ఇన్‌క‌మ్ ట్యాక్స్ క‌ట్టాన‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌, 2009లో ప్ర‌జారాజ్యం త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న 2014లోవైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. 2019లో కాకినాడ రూర‌ల్ నుంచి విజ‌యం ద‌క్కించుకుని మంత్రి కూడా అయ్యారు.

మ‌రి దాదాపు 20 ఏళ్లుగా అస‌లు జ‌ర్న‌లిజం వృత్తిలోనే లేని కుర‌సాల క‌న్న‌బాబుకు ఇప్పుడు ఇంటి స్థ‌లం కేటాయించడం ఏంటి ? అస‌లు ఆయ‌న‌కు అక్రిడిటేష‌న్ ఎలా వ‌చ్చింది? వ‌చ్చినా.. ఆయ‌న ఏపీకి చెందిన వారు కాబ‌ట్టి.. ఎలా అంగీక‌రించారు? అస‌లు జాబితాను స‌రిచూసుకున్నారా? లేదా? ఇలా.. అనేక సందేహాలు ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చాయి. ఇదే క‌నుక నిజ‌మై.. కుర‌సాల క‌న్న‌బాబుకు క‌నుక జ‌ర్న‌లిస్టు కోటాలో ఇంటి స్థ‌లం కేటాయించి ఉంటే.. పెను వివాద‌మే చెల‌రేగే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on September 9, 2024 10:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాకు మహారాజ్ – ఎమోషన్ ప్లస్ రివెంజ్

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…

10 mins ago

రెండు దశాబ్దాల తర్వాత ఆరు జోడి

ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…

6 hours ago

ప్ర‌జ‌ల‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్తున్న చంద్ర‌బాబు!

అదేంటి.. అనుకుంటున్నారా? ప్ర‌పంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారా?…

8 hours ago

విశ్వక్సేన్.. ప్రమోషన్ల మాస్టర్

ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…

8 hours ago

పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…

8 hours ago

ఏఆర్ రెహమాన్.. బ్యాడ్ న్యూస్ తరువాత గుడ్ న్యూస్

భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…

8 hours ago