బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, ఘోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన హైడ్రాపై ఆయన కామెంట్లు కుమ్మరించారు. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌కు చెందిన కాలేజీలను కూల్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ కాలేజీలను కూల్చేస్తే.. మీరే హీరో అని ఒప్పుకొంటా! అని హైడ్రా కమిషనర్ రంగ్‌నాథ్‌ను ఉద్దేశించి రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
గత కొన్నాళ్ల కిందట ఓవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీ వ్యవహారం తెరమీదికి వచ్చింది. వీటిని కూడా చెరువులను ఆక్రమించి కట్టారంటూ.. కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. అవసరమైతే.. తనపై తుపాకీ తూటాల వర్షం కురిపించినా ఇష్టమేనని.. కానీ, ఎంతో మంది పేదలకు విద్య నేర్పిస్తూ.. జీవితాలపై భరోసా కల్పిస్తున్న కాలేజీలను కూల్చేందుకు ఒప్పుకోనని ఆయన తేల్చి చెప్పారు.
ఆ తర్వాత.. ఈవిషయం కొంత నెమ్మదించింది. ఇక, ఇప్పుడు ఆదివారం.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూల్చి వేతలు కొనసాగుతున్నాయి. ఏకంగా 30 టీమ్‌లతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. భారీ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు పెట్టి మరీ కూల్చివేస్తున్నారు. అదేవిధంగా పలు చోట్లకూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన రాజా సింగ్.. ఎంఐఎంకు చెందిన ఫాతిమా కాలేజీల ప్రస్తావన తెచ్చారు.
ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పండి. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలి. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలం అయినట్లే అని రాజాసింగ్ ట్వీట్ చేశారు. దీనిపై సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on September 8, 2024 10:10 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…