పాలనకు, పాలకులకు అర్థాన్ని మార్చి, ప్రజల అభివృద్దే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా రాజకీయ ప్రస్థానం సాగించిన నాయకుడి అక్రమ అరెస్టుకు ఏడాది అయింది. రాజకీయ కక్ష సాధింపులతో దేశం గర్వించే రాజనీతిజ్ఞుడు అరెస్టు అది. దేశాన్ని నివ్వెరపరిచిన.. ప్రభుత్వ టెర్రరిజం పతాకస్థాయికి చేర్చిన అరెస్టు. దేశంలో కోట్లమంది ప్రజల గుండెలను బరువెక్కించిన అరెస్టు కూడా. ప్రపంచంలో ఎన్నడూ లేనివిధంగా ఒక రాజకీయ నాయకుడి కోసం 70 దేశాల్లో ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేసిన అరెస్టు కూడా అదే.
అదే.. ప్రస్తుత సీఎం చంద్రబాబును గత ఏడాది ఇదే రోజు(సెప్టెంబరు 8)న వైసీపీ ప్రభుత్వం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్ మెంటులో మార్పుల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని పెట్టిన కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. ఏకంగా 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. అయితే.. ఇది నిద్రాణమై, భయకంపితులై ఉన్న ప్రజల్లో తిరుగుబాటు తీసుకువచ్చేలా చేసింది. జగన్ ప్రభుత్వం అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా తెలుగు జాతి గళమెత్తింది.
ప్రజాస్వామ్యం కోసం రాజకీయ ప్రయోజనాలు వదులుకునే నేతను అప్రజాస్వామ్యకంగా చేసిన అరెస్టు చేశారంటూ.. దేశవిదేశాల్లోని తెలుగు వారు.. ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాలు చేశారు. రాష్ట్రంలోనే కాకుండా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా వివిధ దేశాల్లోనూ చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాబు అభిమానులు రోడ్డెక్కారు. తొలి వారం రోజులు అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. తర్వాత.. జనసేన అధినేత పవన్ ఎంట్రీతో అంతా మారిపోయింది.
ఇక, అప్పటి నుంచి చంద్రబాబు విడుదల కోసం.. జగన్ ప్రభుత్వ అరాచకంపై ఉద్యమించని నాయకు డు, కార్యకర్త లేడంటే అతిశయోక్తికాదు. మరోవైపు.. న్యాయ పోరాటం కూడా కలిసి వచ్చింది. మొత్తంగా చంద్రబాబు 53 రోజుల జైలు జీవితానికి ముగింపు పలికి బెయిల్‌పై బయటకు వచ్చారు. దీంతో తమ్ముళ్ల సంబరాలకు అంతు లేకుండా పోయింది. ఇక, చంద్రబాబు అరెస్టు రోజును పురస్కరించుకుని ఆదివారం(నేడు) రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. నల్ల జెండాలు పట్టుకుని.. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నారు. వరద ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
This post was last modified on September 8, 2024 3:49 pm
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…