Political News

త‌న టీంను రెడీ చేసుకున్న ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఎట్ట‌కేల‌కు త‌న టీంను రెడీ చేసుకున్నారు. గ‌త నెల మొదటి వారం లోనే ఏపీలో త‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ప్ర‌త్యేకంగా కొంత మంది పేర్ల‌తో కూడిన బృందాన్ని ఎంపిక చేసుకుని ఢిల్లీ చేరుకున్నారు. దీనికి అఖిల భార‌త కాంగ్రెస్ క‌మిటీతో ఆమోద ముద్ర వేయించుకున్నారు. దీనిపై కొన్ని విమ‌ర్శ‌లు, మ‌రికొన్ని సూచ‌న‌లు వ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గ‌ని ష‌ర్మిల‌.. మొత్తానికి అధిష్టానంతో ఆమోదం ముద్ర వేయించుకోవ‌డంలో సక్సెస్ అయ్యారు.

ప్ర‌ధానంగా వైఎస్‌కు అనుచ‌రులుగా పేరొందిన చాలా మందికి ష‌ర్మిల త‌న బృందంలో చోటు ఇచ్చారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ మోహ‌న్ కూడా ఉన్నారు. ఈయ‌న‌కు బాప‌ట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా అవ‌కాశం క‌ల్పించారు. అదేవిధంగా సీనియ‌ర్ నాయ‌కుడు న‌ర‌హ‌రిశెట్టి న‌ర‌సింహారావుకు విజ‌య‌వాడ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా చాన్స్ ఇచ్చారు. ఈయ‌న వైఎస్‌కు అత్యంత విధేయ నేతగా గుర్తింపు పొందారు.

మొత్తంగా 25 జిల్లాలకు కాంగ్రెస్ అధ్య‌క్షులు, 13 మంది రాష్ట్ర స్థాయి ఉపాధ్య‌క్షులు, 37 మంది ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, 10మంది న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుల‌తో ష‌ర్మిల త‌న కొత్త టీంను ఏర్పాటు చేసుకున్న‌ట్టు అయింది. అయితే.. ఎన్నికల త‌ర్వాత‌.. ష‌ర్మిల‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారిని ఈ క‌మిటీ నుంచి ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్మం. సుదీర్ఘ కాలం పార్టీలో ప‌నిచేసిన సుంక‌ర ప‌ద్మ‌శ్రీ వంటివారికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇదేస‌మ‌యంలో మాజీ మంత్రులు.. సాకే శైల‌జానాథ్ వంటివారికి కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఇదీ.. ష‌ర్మిల టీం..

జిల్లాల అధ్య‌క్షులు..

అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడుగా సాతాక బుల్లిబాబు, శ్రీకాకుళం – అంబటి కృష్ణారావు, విజయన గరం – మరిపి విద్యాసాగర్, విశాఖపట్నం – వెంకట వర్మ రాజు, అనకాపల్లి – మీసాల సుబ్బన్న, కాకినాడ – మద్దేపల్లి సత్యానందరావు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ – కొండేటి చిట్టిబాబు(ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరారు), ఈస్ట్ గోదావరి – విశ్వేశ్వర్ రెడ్డి, వెస్ట్ గోదావరి – హరి కుమార్ రాజు, ఏలూరు – రాజనాల రామ్మోహన్ రావు, కృష్ణాజిల్లా – గొల్లు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా – బొర్రా కిరణ్, గుంటూరు – చిలకా విజయ్, బాపట్ల – ఆమంచి కృష్ణమోహన్, పల్నాడు – అలెక్స్ సుధాకర్, ప్రకాశం – షేక్ సైదా, నంద్యాల – జంగేటి లక్ష్మి నరసింహ యాదవ్, కర్నూలు – పరిగెల మురళి కృష్ణ, అనంతపురం – మధుసూదన్ రెడ్డి, క‌డ‌ప‌- విజయజ్యోతి, శ్రీ సత్యసాయి – హినయ్ తుల్లా, నెల్లూరు జిల్లా- చేవూరు దేవ కుమార్ రెడ్డి, తిరుపతి – బాలగురవం బాబు, చిత్తూరు – పోటుగారి భాస్కర్ నియ‌మితుల‌య్యారు.

న‌గ‌ర పార్టీ అధ్య‌క్షులు..

విజయవాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా నరహరి శెట్టి నరసింహ రావు, కాకినాడ సిటీ – చెక్కా నూకరాజు, రాజమండ్రి – బాలేపల్లి మురళీధర్, శ్రీకాకుళం – రెల్లా సురేష్, విశాఖపట్నం – పిరిడి భగత్, తిరుపతి – గౌడపేరు చిట్టిబాబు, చిత్తూరు – టిక్కారాం, ఒంగోలు – నాగలక్ష్మి, కర్నూలు – షేక్ జిలానీ భాషా, కడప – అఫ్జల్ అలీ ఖాన్ ఉన్నారు.

This post was last modified on September 8, 2024 10:13 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

54 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago