టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా వేధించారంటూ ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం దుమారం రేపింది. తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె వీడియోను బయటపెట్టిన వైనం రాష్ట్ర రాజకీయాలలో షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఆమె ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖను, ఆదిమూలం రాసలీలల వీడియోను ఆమె మీడియాకు విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఆదిమూలం ఖండించారు. అయితే, తాజాగా ఆ మహిళ ఫిర్యాదుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు అధికారికంగా ప్రకటించారు.
ఈ ఏడాది జూలై 6వ తేదీన తిరుపతిలోని ఓ హోటల్ కు తాను వెళ్ళానని, రూమ్ నెంబర్ 109 లో సాయంత్రం 4 గంటలకు ఆదిమూలం తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత జూలై 17వ తేదీన అదే హోటల్లోనే రూమ్ నెంబర్ 105లో మధ్యాహ్నం 3 గంటల సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించారు. ఆ తర్వాత అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యే తనకు ఫోన్ చేస్తున్నారని, ఆ ఫోన్ కాల్స్ గురించి తన భర్త నిలదీయడంతో జరిగిన విషయాన్ని బయటపెట్టానని చెప్పుకొచ్చారు.
భర్త సూచనల ప్రకారం ఎమ్మెల్యే ఆదిమూలంకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని, ఆ క్రమంలోనే పెన్ కెమెరాలో ఈ వ్యవహారాన్ని రికార్డ్ చేశానని ఆమె చెప్పారు. ఆగస్టు 10న హోటల్లో ఆదిమూలం రాసలీలల వీడియో రికార్డు చేసి తన భర్తకి ఇచ్చానని ఆమె వివరించారు. ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
This post was last modified on September 5, 2024 4:31 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…