‘అయోమ‌యం’ జ‌గ‌న్‌.. సోష‌ల్ మీడియాకు భారీ ఫీడ్‌!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ మాట్లాడినా.. స్క్రిప్టును క‌ళ్ల ముందు ఉంచుకుని చ‌ద‌వ‌డం తెలిసిందే. అయితే.. ఇటీ వ‌ల ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న అస‌లు బ‌య‌ట‌కే రావ‌డం లేదు. వ‌చ్చినా.. ఏదో నాలుగు మాట‌లు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఫ‌లితం వ‌చ్చాక‌.. జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లోనూ.. ఆయ‌న చూసే చ‌దివారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. కాగా.. జ‌గ‌న్ ఎప్పుడు మాట్లాడినా.. ఆ విష‌యాలు సోష‌ల్ మీడియాలో భారీగా ఎత్తున హైలెట్ అవుతా యి. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని విష‌యాల్లో ఆయ‌న త‌లా తోకా లేకుండా మాట్లాడ‌డ‌మే.

అది కూడా.. చిన్న‌పిల్ల‌లకు తెలిసిన విషయాలు కూడా ఆయ‌న‌కు తెలియ‌క‌పోవ‌డమే! హైవే టోల్ గేట్ ద‌గ్గ‌ర బైకులు ఎందుకు ఆగుతాయంటే.. టోల్ గేట్ క‌ట్టేందుక‌ని జ‌గ‌న్ చెబుతారు. ఇక‌, ఏపీలో క‌ష్టాల‌కు చంద్ర‌బాబు పాల‌నే కార‌ణ‌మ‌ని అంటారు. వ‌ర‌దలకు బాబుకు ముడిపెట్టేసి ఆయ‌న తాజాగా ఏదో చెప్పాల‌ని అనుకున్నారు. కానీ, చిత్రంగా ఆయ‌న‌కు ఆయ‌నే బుట్ట‌లో ప‌డ్డారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల ఓటింగ్‌.. ఫ‌లితాల‌కు సంబంధించి.. జ‌గ‌న్ భారీగానే త‌డ‌బ‌డ్డారు. ఏదైనా ఒక త‌డ‌బాటు జ‌రిగిన‌ప్పుడు.. దానిని ఎంట‌నే స‌రిచేసుకునేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తారు. కానీ, జ‌గ‌న్ స‌ర్‌.. మాత్రం ఏమాత్రం స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

పైగా త‌డ‌బ‌డిన ప‌దాన్ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. “మే 13న ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టికి నాలుగు మాసాలైంది. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తున్నాడు” అని జ‌గ‌న్ తాజాగా ప్ర‌శ్నించారు. ఈ మాట‌ను ఆయ‌న ప‌దే ప‌దే చెప్పుకొచ్చా రు. అయితే.. చిత్రం ఏంటంటే.. అస‌లు ఎన్నిక‌లు పోలింగ్ జ‌ర‌గింది.. మే 13న , ఫ‌లితం వ‌చ్చింది మాత్రం జూన్ 4న. ఈ విష‌యం తెలిసి కూడా.. జ‌గ‌న్ ఎందుకో.. మ‌రిచిపోయిన‌ట్టున్నారు. ఆయ‌న ఓట‌మి తాలూకు ప‌రాభ‌వం నుంచి ఇంకా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్టుగా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు నెటిజ‌న్లు. గ‌తంలోనూ ఆయ‌న అనేక సంద‌ర్భాల్లో త‌డ‌బ‌డిన ప‌రిస్థితి ఉంది. కానీ.. ఇప్పుడు ఏకంగా ఎన్నిక‌లు ఫ‌లితంపైనే ప‌దే ప‌దే త‌డ‌బ‌డ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.