75 ఏళ్ల వయసు.. ముఖ్యమంత్రి హోదా.. వీటిని సైతం పక్కన పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు మోకాల్లో తు నీటిలో తిరుగుతున్నారు. సాధారణ ఎమ్మెల్యేనే మురుగు నీటిలోకి, వరద నీటిలోకి అడుగు కూడా పెట్టేందుకు సందేహించే రోజులు ఇవి. ఇలాంటి సమయంలో తన వయసును, హోదాను కూడా పట్టించుకోకుండా.. ప్రజల కోసం.. అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో కూడా.. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్‌నే ముఖ్యమంత్రి నివాసం మార్చుకున్నారు.
అక్కడే నిద్రిస్తున్నారు. లేకపోతే.. ఒక్కొక్కసారి అది కూడా లేదు. అంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల గురించే ఆలోచన చేస్తున్నారు. నేరుగా తనే రంగంలోకి దిగిపోతున్నారు. అధికారులను అదిలిస్తున్నారు. తాను పరుగులు పెడుతూ.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కానీ.. ఈ క్రమంలో కొందరు అధికారులు నత్తనడకన వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. అలాంటి వారిని హెచ్చరిస్తూ.. తాను మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. ముందుకే అన్నట్టుగా సాగుతున్నారు.
చంద్రబాబు వ్యవహార శైలిని గమనిస్తే.. ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి కారణం.. మిత్ర పక్షాల్లో కేవలం జనసేన మాత్రమే ఒకింత యాక్టివ్‌గా ఉంది. బీజేపీ అసలు ముసుగుతన్నే సింది. తమకేమీ పట్టనట్టుగానే నాయకులు వ్యవహరిస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదు.. నలుగురు ఎంపీలు ఎక్కడున్నారో.. వారికే అర్ధం కాదు. అయినప్పటికీ..చంద్రబాబు తన పోరాటాన్ని ఎక్కడా వదిలి పెట్టలేదు.
బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు కదులుతూనే ఉన్నారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి మీడియా ముందుకు వస్తున్నారు. తానేంచేసిందీ చెబుతున్నారు. ఎక్కడెక్కడ తిరిగిందీ.. ఎంత మంది బాధితులను ఓదార్చింది కూడా చెబుతున్నారు. ఆహారం, తాగునీరు వంటివాటిని విరివిగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇంత చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో యంత్రాంగంలో లోపించిన నిబద్ధత కారణంగా.. సరైన విధంగా ఆ సాయం ప్రజలకు చేరడం లేదన్నది వాస్తవం. కానీ, చంద్రబాబు కృషిని మాత్రం అభినందించకుండా ఉండలేం.
This post was last modified on September 5, 2024 11:16 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…