Political News

క్రెడిట్ అంతే బాబు, వైఎస్ లదే కేసీఆర్ పాలన టైంపాస్ – రేవంత్

పాలనాపరంగా తనదైన మార్క్ కోసం తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఆసక్తికరంగా మారింది. చైనా ప్లస్ వన్ ప్రాజెక్టు పేరుతో ప్రస్తావించిన ఈ అంశం ఏమిటి? ఇది దేని గురించి చెబుతుంది? తెలంగాణకు ఏ విధంగా లింక్? అన్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంతే సమాధానం చెప్పేశారు. ఆయనేం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

‘‘చైనా వన్ ప్లస్ అన్నది అతి పెద్ద ప్రాజెక్టు. కోవిడ్ తర్వాత అమెరికా.. దక్షిణ కొరియా.. తైవాన్ లాంటి అనేక దేశాలు చైనాకు వెళ్లటానికి వెనకాడుతున్నాయి. చైనాకు ఏదైనా సమస్య వస్తే మొత్తం అల్లకల్లోలమైపోతోంది. అందుకే చైనాకు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని వెతుకుతున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవటానికి మేం ప్రయత్నిస్తున్నాం. తెలంగాణనే ఆ గమ్యస్థానంగా భావించి పెట్టుబడులు పెట్టాలని నేను పారిశ్రామికవేత్తలను కోరుతున్నా’’ అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు. అదే సమయంలో తెలంగాణపై తనకున్న విజన్ ను వెల్లడించారు సీఎం రేవంత్.

తన మాటలకు ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారన్న రేవంత్.. సదరు కంపెనీ ఎంత పెద్దదన్న విషయాన్ని చెబుతూ.. ‘‘ఫాక్స్ కాన్ కంపెనీ రూ.16 లక్షల కోట్ల సంస్థ. ఈ కంపెనీకి ఫోర్త్ సిటీలో 2 వేల ఎకరాలు ఇస్తామని చెప్పా. ఇక్కడే కొత్త సిటీని నిర్మించాలని కోరా. దేశంలోని వాళ్లకున్న వ్యవస్థలన్నింటిని తీసుకొచ్చి తెలంగాణ నుంచే ప్రధాన కేంద్రాన్ని నడపాలని కోరా. అధ్యయనం చేస్తానని చెప్పారు. సానుకూలంగా స్పందించారు’’ అని పేర్కొన్నారు.

అదే రీతిలో ఎమ్మార్ కంపెనీని ఆహ్వనించామని.. జపాన్ కు చెందిన ఒక కంపెనీకి వెయ్యి ఎకరాలు కేటాయించేందుకు తాము ఓకే చేసినట్లు చెప్పిన రేవంత్.. ‘‘నేను యాంకర్ పాత్రను మాత్రమే పోషిస్తున్నా. పూర్వ ముఖ్యమంత్రులు చంద్రబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాల సమయంలో హైదరాబాద్ ను ఓఆర్ఆర్ వరకు డెవలప్ చేశారు. వారు చేసిన దాని కంటే రెట్టింపు డెవలప్ మెంట్ చేసి చూపిస్తా. గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాలక్షేపం చేసిందే తప్ప కొత్తవేమీ తీసుకురాలేదు’’ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కొన్ని కీలక విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ‘‘పాత సచివాలయం స్థానంలో కొత్తది కట్టటం.. సీఎం కార్యాలయం స్థానంలో ప్రజాభవన్ నిర్మించటం లేదా ఉన్న పరిశ్రమకు అనుబంధంగా మరొకటి పెంచటమే తప్పించి.. కేసీఆర్ హయాంలో ల్యాండ్ మార్క్ డెవలప్ మెంట్ అంటూ ఏమీ జరగలేదు. కొత్త వ్యవస్థల్ని ఏర్పాటు చేయలేదు. పదేళ్లు అద్భుతాలు చేసే వీలున్నా.. వ్యవస్థలన్నింటిని భ్రష్టు పట్టించారు’’ అని ఘాటుగా విమర్శించారు.

జహీరాబాద్ నిమ్జ్ ను కేంద్రం పక్కన పెడితే దాన్ని పునరుద్ధరణ చేయించానని.. కియా కార్ల కంపెనీతో మాట్లాడుతున్నామని.. వచ్చే నెలలో హ్యుందయ్ కంపెనీ పని ప్రారంభిస్తుందన్న రేవంత్.. స్కిల్ వర్సిటీ.. స్పోర్ట్స్ వర్సిటీ.. ఇలా కొత్త వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తన హయాంలో ప్రారంభించినవన్నీ తొలి విడతలోనే పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. లక్ష్య సాధన కోసం కొంత కఠినంగా వ్యవహరిస్తామని.. అందుకు హైడ్రానే ఉదాహరణగా చెప్పారు.

ఎఫ్ టీఎల్.. బఫర్ జోన్… నాలా.. పార్కుల స్థలాల్్ని రక్షించేందుకు ప్రాధాన్యమిస్తామని.. ఇందుకోసం ఆక్రమణలు తొలగించటం తప్పించి మరో మార్గం లేదని స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ నుంచి పైపులైన్ ద్వారా నీటిని మళ్లించి రెండు రిజర్వాయర్లు నింపుతామని.. ఖర్చు తక్కువే అవుతుందని.. శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తామన్న రేవంత్.. గ్రేటర్ హైదరాబాద్ ఫ్యూచర్ ను ద్రష్టిలో పెట్టుకొనే ఇవన్నీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

This post was last modified on September 1, 2024 11:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగనన్న కాలనీలు కాదు… మరేంటి!

ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…

35 minutes ago

‘ఫన్ బకెట్’ భార్గవ్ కు 20 ఏళ్ల జైలు

ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…

35 minutes ago

రఘురామను హింసించిన వ్యక్తికి టీడీపీ ఎమ్మెల్యే పరామర్శ?

ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…

49 minutes ago

కాంగ్రెస్ ఒంట‌రి.. రాహుల్ స‌క్సెస్‌పై ఎఫెక్ట్‌!

జాతీయ‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి ఒంట‌రి ప్ర‌యాణాన్ని త‌ప్పించుకునేలా క‌నిపించ‌డం లేదు. ఏడాదిన్న‌ర కింద‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే…

2 hours ago

పిఠాపురంలో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌… రీజ‌నేంటి?

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో ఆక‌స్మికం గా ప‌ర్య‌టించారు. వాస్త‌వానికి…

2 hours ago

టీటీడీ చైర్మన్, ఈవో కూడా సారీ చెప్పాలన్న పవన్

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…

2 hours ago