రానున్న రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు అవసరం చాలానే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం మోడీ సర్కారు.. వక్ఫ్ బోర్టు చట్టాన్ని సవరణ చేస్తోంది. ఇది అత్యంత కీలకమైన చట్టం. దీనికి సంబంధించి.. పార్లమెంటులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ముందుకు సాగాల్సిన అవసరం మోడీకి ఉంది. ఇప్పటి వరకు ఉన్న వక్ఫ్ చట్టాన్ని పరిశీలిస్తే.. కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. వక్ఫ్ చట్టం ప్రకారం.. బోర్డు సభ్యులు.. ఎక్కడి స్థలాన్నయినా.. తమదేనని చెప్పుకొనే అవకాశం ఉంది.
అంటే.. కొన్ని వందల సంవత్సరాలుగా ఒక చోట నిర్మాణాలు జరిగి ప్రజలు ఉన్నారని అనుకుంటే… ఇప్పుడు అక్కడికి వెళ్లి.. అవి తమ భూములేనని వక్ఫ్ సభ్యులు చెబితే.. వారికి ఇచ్చేయాలి. ఆశ్చర్యంగా ఉన్నా.. వక్ఫ్ చట్టం అదే చెబుతోంది. దీనిని మార్చాలనేది మోడీ ప్రయత్నం. అయితే.. ప్రస్తుతం కూటమి సర్కారు ఉండడంతో బలమైన మెజారిటీ లేకపోవడంతో చంద్రబాబు అవసరం మోడీకి ఎంతో ఏర్పడింది. మరోవైపు.. కూటమిగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు.
వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వక్ఫ్ చట్టానికి బీహార్ సీఎం తరఫున ఎంపీలు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. దీంతో మోడీ సర్కారు ఇప్పుడు చంద్రబాబు సర్కారుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. దీనికి ముందే..చంద్రబాబుకు మోడీ భారీ గిఫ్ట్ ఇచ్చేశారు. రెండు నెలల కిందట ప్రకటించిన రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లను గ్రాంటుగా ప్రకటంచింది. ఇది కూడా ఆశ్చర్యం కాదు. నిజమే. తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో అమరావతికి ఇచ్చే రూ.15 వేల కోట్లను ఏపీ ప్రభుత్వం తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అయితే.. దీనిని అప్పుగా తీసుకువచ్చిన.. దీనిని కేంద్రమే తీర్చుకుంటుంది. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఏపీపై ఉండదు. అయితే.. ఇలా చేయడానికి కారణం.. వక్ఫ్ చట్టం విషయంలో చంద్రబాబు సంపూర్ణంగా సహకరించాల్సి ఉంటుందనేది జాతీయ మీడియా వర్గాలు చెబుతున్న మాట. కానీ, దీనికి అనుమతి ఇవ్వరాదని.. మద్దతు విషయంలో ఆలోచించుకోవాలని.. మైనార్టీ నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు సూచించారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 1, 2024 10:56 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…