Political News

చంద్ర‌బాబు వార్నింగ్‌: ఇప్ప‌టికైనా త‌మ్ముళ్లు దారికొస్తారా?

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేందుకు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డిన త‌మ్ముళ్లే.. ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ వివాదాలు.. విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటున్నారు. అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు చాలా మంది త‌మ్ముళ్లు నిత్యం ఏదో ఒక వివాదంతో తెర‌మీదికి వ‌స్తున్నారు. కొన్ని ఘ‌ట‌న‌లు మెయిన్ మీడియాలో వ‌స్తుండ‌గా.. మ‌రిన్ని ఘ‌ట‌న‌ల‌పై పార్టీకి ప్ర‌తి రోజూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ఇవ‌న్నీ.. క‌ల‌గ‌లిపి చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారాయి. ఆయా అంశాల‌పై మ‌రింత ప్ర‌చారం పెరుగుతున్న‌నేప‌థ్యంలో చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు.

త‌ప్పులు చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాల‌ను ఉద్దేశించి.. చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే స్పందించారు. “మీరు మార‌తార‌ని ఆశిస్తున్నా. మార‌క‌పోతే.. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. గ‌తంలో ఇలానే చేసిన‌వారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఆలోచిం చుకోండి” అని కొంద‌రి పేర్ల‌ను కూడా చంద్ర‌బాబు తాజాగా చెప్పుకొచ్చారు. వీరిలో కొంద‌రికి తాజా ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వ‌లేదు. మ‌రికొంద‌రికి మంత్రి పీఠాలు ద‌క్క‌లేదు. వీరి పేర్ల‌ను ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గ స‌మావేశంలో గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. అంతేకాదు.. వ‌చ్చే వారంలో నేత‌లంద‌రితోనూ.. జూమ్ స‌మావేశం పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు.

ఇదేస‌మ‌యంలో మంత్రుల‌కు కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఎక్క‌డ ఎలాంటి గ‌లాటా జ‌రిగినా.. దానిలో టీడీపీ ఎమ్మ‌ల్యేలు, వారి కుటుంబ స‌భ్యుల పాత్ర ఉన్నా.. అక్క‌డిక‌క్క‌డే హెచ్చ‌రించాల‌ని ప‌వ‌ర్స్ ఇచ్చారు. ఆ విష‌యాల‌ను త‌న దృష్టికి కూడా తీసుకురావాల‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండ‌బోద‌ని చంద్ర‌బాబు చెప్పారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితికి వ‌చ్చిందంటే.. కార‌ణం.. అలాంటి ఘ‌ట‌నలేన‌ని చెప్పారు.

నాయ‌కులు, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలే తెగ‌బ‌డితే.. సాధార‌ణ ప్ర‌జ‌ల్లో అలుసై పోమా? అని హెచ్చ‌రించారు. ఈ ప‌రిస్థితి మార‌క‌పోతే.. తానే మారే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని కూడా చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఇదే మొద‌టి, ఫైన‌ల్ వార్నింగ్ అని తేల్చి చెప్పారు. అయితే.. చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌ల‌ను ఎంత మంది త‌మ్ముళ్లు పాటిస్తారో చూడాలి. ఎక్క‌డిక‌క్క‌డ ఆధిప‌త్య ధోర‌ణి, పైచేయి కోసం ప్ర‌య‌త్నిస్తున్న త‌మ్ముళ్లు.. ఇప్ప‌టికైనా మార‌క‌పోతే.. చంద్ర‌బాబు వారిపై కొర‌డా ఝ‌ళిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

This post was last modified on August 29, 2024 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆర్య 2 మీద పుష్ప 2 ప్రభావం

ఈ రోజు ఆర్య 2 రీ రిలీజ్ జరిగింది. అసలు విడుదల టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ…

1 hour ago

పోటాపోటీ నినాదాల మధ్య నాగబాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో గడచి రెండు రోజులుగా టీడీపీ, జనసేన…

1 hour ago

వ్యాపారాన్ని నిర్ణయించబోయే ‘పెద్ది’ షాట్

రేపు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది టీజర్ విడుదల చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బకు తీవ్ర నిరాశలో…

3 hours ago

ఐపీఎల్: క్రేజ్ ఉంది కానీ.. ఫామ్ లేదు!

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓ వర్గం అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఎక్కువ అంచనాల మధ్య బరిలోకి…

3 hours ago

ప్రశాంత్ వర్మ ప్రపంచంలో ఛావా విలన్

స్టార్ క్యాస్టింగ్ లేకుండా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దాని సీక్వెల్ జై హనుమాన్…

4 hours ago

పొట్లంలో భోజనం.. ఆరేడు కిలోమీటర్ల నడకతో బాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో…

4 hours ago