వైసీపీ అధినేత జగన్ వచ్చే నెలలో తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని బ్రిటన్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పర్యటనను రద్దు చేసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. అనూహ్యంగా బుధవారం ఒక్కరోజే.. ఉరుములు లేని పిడుగులు పడినట్టుగా పార్టీ పరిస్థితి మారిపోయింది. నిన్న గాక మొన్న తనతో కలిసి నెల్లూరు జైలుకు వచ్చి.. పిన్నెల్లి రామకృష్నారెడ్డిని పరామర్శించిన.. పోతుల సునీత వంటి నమ్మకస్తురాలైన నాయకురాలు హ్యాండిచ్చారు.
ఇక, ఎంతో నెత్తిన పెట్టుకుని.. అన్ని పదవులకు ఎంపిక చేసిన మోపిదేవి వెంకటరమణ కూడా .. జంప్ అయిపోతున్నారు. ఇక, రేపో మాపో… మరింత మంది రెడీగా ఉన్నారని సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బ్రిటన్ కు వెళ్తే.. పార్టీపై మరింత ప్రబావం పడే అవకాశం ఉంటుందని జగన్ తలపోస్తున్నారని తెలిసింది. నిజానికి వచ్చే నెలలో 20 రోజుల పాటు ఆయన బ్రిటన్‌లో ఉండేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
సిబీఐ కోర్టు నుంచి అనుమతి కూడా తెచ్చుకున్నారు. కుమార్తెలతో కలిసి.. అక్కడ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ ఒక్కసారిగా ఆలోచనలో కూరుకుపోయారు. అయితే.. జగన్‌కు ఇలాంటి పరిస్థితులు కొత్తకావు. గతంలోనూ అనేక మంది నాయకులు వచ్చారు వెళ్లారు. కానీ, అప్పుడు పార్టీ బలంగా ఉంది. కానీ,ఇప్పుడు ప్రజల్లోనే పార్టీ బలంగా లేదు. పైగా.. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడు స్థానికంగా ఉండాల్సి ఉంది. అందుకే ఆయన బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరిగినా ఎదిరించాలంటే.. ఆయన ఇక్కడే ఉండడం మంచిదని కొందరు సీనియర్లు కూడా భావిస్తున్నారు. అవసరమైతే.. కొందరిని బుజ్జగించాలని కూడా భావిస్తున్నారు. నిజానికి ఇది జగన్ మనస్తత్వానికి వ్యతిరేకమే అయినా.. ఇప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. సో.. మొత్తానికి పార్టీలో ఏర్పడిన కల్లోలం కారణంగా జగన్ విదేశీ పర్యటన రద్దయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
This post was last modified on August 29, 2024 10:24 am
గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…
"ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్నట్టు.. లేదంటే లేనట్టు!"- జాతీయ స్థాయి నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్…
వరుస బ్లాక్ బస్టర్లలో ఊపుమీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన దశ తిరిగేలా చేసిన సినిమా.. అఖండనే. ఆ సినిమా ఎవ్వరూ…
ఆమంచి కృష్ణమోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన పరిస్థితి డోలాయమానంలో ఉంది.…