ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశం లో పలు కొత్త నిర్ణయాలతోపాటు.. జగన్ హయాంలో తీసుకువచ్చిన పలు అంశాలను కూడా రద్దు చేసింది. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో ఉప ముఖ్యమం త్రి పవన్ కల్యాణ్ సహా.. మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రివర్స్ టెండర్ విధానాన్ని మంత్రులు రద్దు చేశారు.
రివర్స్ టెండర్ విధానాన్ని జగన్ తీసుకువచ్చారు. అంటే..అ ప్పటికే టెండర్లు పూర్తియిన వాటికి మరోసా రి టెండర్లు నిర్వహించి.. ఇంకా తక్కువ ధరలకే కోట్ చేసేవారిని ఆహ్వానించడం. దీనివల్లే పోలవరం పనులు సగంలో ఆగిపోవడంతోపాటు ఆలస్యం కూడా అయ్యాయనే వాదన వినిపించింది. ఈనేపథ్యంలో రివర్స్ టెండర్ల విధానాలపై అనేక విమర్శలు, వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. దీనిని రద్దు చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి.
తాజాగా చంద్రబాబు సర్కారు రివర్స్ టెండర్ల విధానానికి స్వస్తి పలికింది. దీని ప్రకారం.. గతంలో ఉన్న టెండర్ల విధానమే కొనసాగనుంది. ఇక, ఎక్సైజ్ శాఖను మరింత పక్కాగా మారుస్తూ.. జగన్ హయాంలో తీసుకువచ్చిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను కేబినెట్ రద్దు చేసింది. వాస్తవానికి ఎక్సైజ్ తో మేలు జరిగింది. అప్పటి వరకు పోలీసులు కూడా మద్యం అక్రమాలకుసంబంధించి కేసులు నమోదు చేసేవారు. దీనివల్ల వారిపై పని ఒత్తిడి పెరిగి సాధారణ ప్రజలకు సేవలు అందించడంలో విఫలమయ్యారు.
ఈ క్రమంలోనే జగన్ ఎస్ ఈబీని తీసుకువచ్చారు. కానీ, ఇప్పుడు దీనిని చంద్రబాబు కేబినెట్ రద్దు చేసింది. ఇక, రైతులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగింపునకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికలకు ముందు ఇది పెద్ద వివాదంగా ఉన్న విషయం తెలిసిందే. దీనిని మారుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు కేబినెట్ నిర్ణయం ప్రకటించింది. ఇక, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరిన్ని నిర్ణయాలు..
+ వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత.
+ ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణ
+ పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ
+ ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు సంస్థ కొనసాగింపు
This post was last modified on August 29, 2024 10:24 am
కంగువ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ సినిమా రెండు వేల కోట్లు వసూలు…
టాలీవుడ్ లోనే కాదు అటు ఉత్తరాదిలోనూ మోస్ట్ వెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా విపరీతమైన అంచనాలు మోస్తున్న పుష్ప 2…
సెలబ్రెటీలు ఏం చేసినా వార్తే. అలాంటిది ఒక స్టార్ హీరో వైన్ షాపుకి వెళ్లి మద్యం కొంటే అంతకంటే వార్త…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రానికి డాకు మహారాజ్ టైటిల్ నిర్ణయించారు. ఈ లీక్…
పాపం దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పరిస్థితి. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా…
ఇద్దరి హీరోల అభిమానులు ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ 4 బాలకృష్ణ, బన్నీల ఇంటర్వ్యూలో మొదటి భాగం నిన్న అర్ధరాత్రి…