వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో రోజా ఇక జగనన్నకు గుడ్ బై చెప్పేసినట్టేనని అంటున్నారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019లో విజయం దక్కించుకున్న రోజా.. మంత్రిగా కూడా రెండేళ్లపాటు అవకాశం చిక్కించుకున్నారు. కానీ, రాష్ట్రంలో మారిన రాజకీయ వాతావరణం.. పైగా కూటమి దూకుడుతో వైసీపీ పుంజుకునేలా కనిపించడం లేదని సీనియర్లు చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలో రోజా కూడా.. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. పైగా తమిళనాడులోనే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడి ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పైగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ను తరచుగా రోజా దంపతులు కలుస్తుండడం.. అక్కడి సంక్షేమ కార్యక్రమాలకు చెక్కుల రూపంలో సాయం చేస్తుండడం కూడా.. తెలిసిందే. ఇక, ఇప్పుడు డీఎంకేలో చేరేందుకు రోజా మార్గం సుగమం చేసుకున్నారనేది చర్చగా మారింది. వైసీపీకి అందుకే దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. దీనికి దన్నుగా.. ఎప్పుడూ తన సోషల్ మీడియా మాధ్యమాలైన.. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్‌లలో జగన్ ఫొటోలు, వైసీపీ జెండాలను ఆమె తీసేశారు.
నిన్న మొన్నటి వరకు కూడీ డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జగన్ ఫొటోలను, జెండాలను పెట్టుకున్నారు. కానీ, రెండు రోజులుగా ఆమె వైఖరి మారిపోయింది. తాజాగా ఆమె డీపీలను మార్చేసి.. పూర్తిగా తన పేరును మాత్రమే పెట్టుకున్నారు. ఎక్కడా వైసీపీ అన్న పేరు కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పరిణామాలతో ఇక, రోజా.. పార్టీ మార్పు ఖాయమైందనే చర్చకు బలం చేకూరింది. ఆమె భర్త సెల్వమణికి తమిళనాడు నేపథ్యం ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన దర్శకుడు కూడా. ఈ నేపథ్యంలోనే రోజా తన రాజీకయ రైలు బండిని రూటు మార్చుకునేలా చేశారని తెలుస్తోంది.
This post was last modified on August 27, 2024 10:46 pm
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…