సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలికి సంబంధించిన లీకులు, అప్డేట్స్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు రేపుతున్నాయి. ముందు నాగార్జున ప్రత్యేక పాత్ర చేస్తున్నారని బయటికొచ్చింది. కానీ ఇటీవలే ఉపేంద్ర సెట్లో అడుగు పెట్టాడు. అంటే నాగ్ వద్దనుకున్న క్యారెక్టర్ ని తనకిచ్చారనే టాక్ చెన్నై వర్గాల్లో బలంగా ఉంది. ఒకవేళ కింగ్ కూడా ఉంటే ఎల్లుండి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అనౌన్స్ మెంట్ ఉంటే తప్ప నమ్మలేం. విక్రమ్ లో రోలెక్స్ తరహాలో ఇందులో లోకేష్ రెండు మూడు పవర్ ఫుల్ క్యామియోలు డిజైన్ చేశాడని టాక్.
తాజాగా అమీర్ ఖాన్ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే లోకేష్ కథ చెప్పాడని సానుకూల స్పందన వచ్చిందని ఇన్ సైడ్ న్యూస్. లాల్ సింగ్ చద్దా తర్వాత గ్యాప్ తీసుకున్న అమీర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సితారే జమీన్ పర్ ఒకటే. దక్షిణాది దర్శకులతో పని చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు కానీ ఇప్పుడు రజనితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కావడంతో నో చెప్పకపోవచ్చు. విక్రమ్, లియో, ఖైదీలు ఎంత బ్లాక్ బస్టర్ అయినా నార్త్ లో ఆశించిన మేజిక్ చేయలేకపోయాయి. అమీర్ లాంటి సపోర్ట్ ఉంటే సులువవుతుంది కాబట్టి అలా ప్లాన్ చేసి ఉండొచ్చు.
వచ్చే ఏడాది వేసవికి ప్లాన్ చేసుకున్న కూలిని తెలుగులోనూ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇంకా మెయిన్ క్యాస్టింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టలేదు. బంగారం స్మగ్లింగ్ చుట్టూ ఎనభై తొంబై దశకంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా కూలీ రూపొందుతోంది. అక్టోబర్ 10 వెట్టయన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఖచ్చితంగా ఒక రిలీజ్ ఉండేలా చూసుకుంటున్న రజినీకాంత్ లిస్టులో తర్వాత కూడా యువ దర్శకులే ఉన్నారట. జైలర్ 2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ అది కాగానే ఫైనల్ వెర్షన్ ఓకే చేయించుకుని సెట్స్ పైకి తీసుకెళ్తాడు.
This post was last modified on August 28, 2024 12:07 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…