వలంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి చర్చకు వచ్చింది. గత వైసీపీ హయాంలో 2.3 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరికి నెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనం ఇస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా.. వారి సమస్యలకు పరిష్కారం చూపేలా.. జగన్ వ్యవహరించారు. వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్ల ద్వారా.. ప్రజలకు మేలు జరిగిందనేది నిర్వివాదాంశం. ఎక్కడొ ఒకరిద్దరు తప్పులు చేయడం అనేది అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నదే.
అయితే.. చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామన్నారు. రూ.5000 గౌరవ వేతనం స్థానంలో రూ.10 వేలు ఇస్తామని కూడా చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే.. ప్రబుత్వం ఏర్పడి 70 రోజులు దాటిపోయినా… వలంటీర్లను ఎక్కడా వినియోగించుకోవడం లేదు. వారి పేరు, ఊరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ విషయంపై కొన్నాళ్ల కిందట శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు కూడా తెలియదు అని సమాధానమే చెప్పారు.
అయితే.. తాజాగా మాత్రం సర్కారు వ్యూహం మారింది. ఈ దఫా వలంటీర్లను తెరమీదికి తీసుకురానుంది. అయితే.. వారితోనే పింఛన్ల పంపిణీ చేయించే కార్యక్రమానికి కాకుండా.. వేరే పనులు అప్పగించాలని నిర్ణయించింది. వచ్చే నెల 1 న కూడా సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లు పంపిణీ చేయించనుంది. అయితే.. వలంటీర్లను నైపుణ్య గణన సహా.. ఇతర అవసరాల కోసం వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఇదే విషయాన్ని సర్కారు స్పష్టం చేసింది.
వలంటీర్లను వినియోగించుకుంటామని.. వారిని తొలగించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వారికి బకాయి ఉన్న రూ.5000 చొప్పున వేతనం ఇవ్వనున్నట్టు తెలిపింది. వచ్చే నెల నుంచి రూ.10 వేల చొప్పున వారికి వేతనం ఇవ్వనున్నారు. మరి ఇలాంటి సమయంలో వారి సేవలను వేరేగా వినియోగించు కోవడంతోపాటు.. ఒక్కొరికీ 100 చొప్పున ఇళ్ల బాధ్యతలను అప్పగించనున్నారు. గతంలో 50 ఇళ్లకు మాత్రమే ఒక వలంటీర్ ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య.. 100కు పెరగనుంది.
This post was last modified on August 26, 2024 6:50 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…