కూటమి సర్కారు పాలనకు రెండు మాసాలు పూర్తయ్యాయి. దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది. కొందరు సూపర్ సిక్స్‌పై ప్రశ్నిస్తుంటే.. మరికొందరు చంద్రబాబు ఇలానే పాలించాలని కోరుకుంటున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచన ఏంటి? అసలు ఆయన పంథా ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. వాస్తవానికి చంద్రబాబు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలు గుప్పించారు. అయితే.. వాటిలో ఒక్క పింఛను తప్ప.. మిగిలిన వాటి ప్రస్తావన చేయడం లేదు.
పైగా.. చంద్రబాబు ఏమైనా బహిరంగ వేదికలపైకి రావడం లేదా? అంటే.. వస్తున్నారు. ప్రజలతో కలవడం లేదా? అంటే కలుస్తున్నారు. కానీ, సూపర్ సిక్స్ అనే మాట వినిపించడం లేదు. ఎన్నికలకు ముందు మాత్రం ఆయన ఎక్కడకు వెళ్లినా.. సూపర్ సిక్స్ గురించి పదే పదే చెప్పారు. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, ఇప్పడు ఆ ఊసే లేకుండా పోయింది. తాజాగా జరిగిన గ్రామ సభల్లోనూ సూపర్ సిక్స్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
అయితే.. ప్రజల నుంచి పెద్దగా సూపర్ సిక్స్ హామీల గురించి వినిపించకపోవడం గమనార్హం. దీనికి కారణం.. రాష్ట్రం అభివృద్ది చెందితే చాలనే మెజారిటీ ప్రజలే చంద్రబాబుకు ఓటేశారు. ఆయన అనుభవాన్ని రంగరించి.. పరిశ్రమలు తీసుకువచ్చి.. ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలని కోరుకున్నారు. రాజధాని నిర్మాణం జరిగే చాలని అనుకున్నవారే మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఇప్పుడు చద్రబాబు అదే పని చేస్తున్నారు.
దీనికి తోడు అప్పులు చేసి భారీ ఎత్తున నగదు పంచినా.. జగన్‌ను ప్రజలు ఆదరించలేదు. కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రత్యేకంగా అప్పులు చేసి.. ప్రజలకు పంచినా.. తన కు వచ్చే మైలేజీ ఏమీ లేదని చంద్రబాబు సైతం భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు సూపర్ సిక్స్‌లో కీలకమైన పథకాలను ప్రవేశ పెట్టే యోచన అయితే .. కనిపించడం లేదు. తాజాగా ఆన్‌లైన్ చానెళ్లు చేసిన సర్వేల్లోనూ నూటికి 70 మంది ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు. సో.. ఎలా చూసుకున్నా.. చంద్రబాబు ప్రజల నాడిని పసిగట్టి దాని ప్రకారమే ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.
This post was last modified on August 26, 2024 6:01 pm
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఇద్దరూ ఒకేసారి విదేశాలకు వెళుతున్నారు. అదేంటీ……