అమర్ రాజా బ్యాటరీస్ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ గురించి కొత్తగా చెప్పనక్కర లేదు. గుంటూరు నుండి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసిన గల్లా వైసీపీ కక్ష్యపూరిత రాజకీయాల మూలంగా తన కంపెనీలు, కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచించి గత ఎన్నికల్లో రాజకీయాల నుండి వెనక్కి తగ్గి పోటీ చేయకుండా ఉండిపోయారు. నిజంగా పోటీ చేస్తే ఈ సారి గెలిచి కేంద్రంలో మంత్రి అయ్యేవాడు అన్న టాక్ వినిపిస్తుంది.
రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఆయనను ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి ఆయన సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. పారిశ్రామికవేత్తగా, రెండు సార్లు ఎంపీగా గల్లాకు ప్రజల సమస్యల మీద, ఏపీ ప్రభుత్వ అవసరాల మీద స్పష్టమయిన అవగాహన ఉంది. ఏపీలో కూటమికి స్పష్టమయిన బలం ఉన్న నేపథ్యంలో రాజ్యసభకు పోటీ చేసి తిరిగి చట్టసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక గుంటూరు నుండి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఆయన అక్కడి నుండి కదిలే అవకాశం ఉండదని, అందుకే ఏపీలోని ఇతర లోక్ సభ నియోజకవర్గాలలో ఏదైనా ఎంచుకుని భవిష్యత్తులో పోటీ చేయాలన్న ఆలోచన కూడా గల్లాకు ఉన్నట్లు తెలుస్తుంది.
2014 నుండి 2024 వరకు ఎంపీగా పనిచేసిన గల్లా పార్లమెంటు సమావేశాలకు 90 శాతం హాజరయ్యారు. 432 ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు 105 చర్చలలో పాల్గొన్నారు. ఆయన లోక్ సభ పనితీరుకు 10కి 8.5 మార్కులు రావడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates