టీడీపీ అధినేత చంద్రబాబుకు, దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న ఫెవికాల్ బం ధం గురించి అందరికీ తెలిసిందే. 1983లో రామారావు కోసం అహర్నిశలు పనిచేసిన.. రామోజీ తర్వాత కాలంలో ఆయనతో విభేదించారు. ఇదేసమయంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. దీనికికారణం వేరే ఉందని అంటారు. రామోజీ ఫిలింసిటీ ఆలోచన 1980లలో నేరామోజీరావు మొగ్గ తొడిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టూడియోలను ఆయన పరిశీలించారు.
ఈక్రమంలో అంతకుమించిన ఫిలిం నగరాన్ని ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేయాలని, అది కూడా హైదరా బాద్‌కు సమీపంలో ఉంచాలని ఆయన అనుకున్నారు. ఈ విషయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న రామారావు సహకరించలేదనేది ఒక వాదన. దీనిలో నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, ప్రచారం అయితే ఉంది. రామోజీరావు.. 1000ఎకరాలు ఇవ్వాలని కోరినట్టు.. దీనికి రామారావు వ్యతిరేకించినట్టు ప్రచారం ఉంది. ఇక, చంద్రబాబు పగ్గాలుచేపట్టాక.. క్షణాలలో దీనికి అనుమతి వచ్చేసిందని అంటారు.
దీంతో అటు చంద్రబాబుకు ఇటు రామోజీకి..పరస్పరం అవగాహన కుదిరింది. ఆ తర్వాత.. చంద్రబాబు కు ఈనాడు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. 2014లో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ఈనాడు పాత్ర ఉంది. ఇక, 2024 ఎన్నికల్లోనూ ఈనాడు పాత్ర అమోఘం. ఈ నేపథ్యంలోరామోజీ రుణాన్ని తీర్చుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని తెలిసింది. ఇప్పటికే ఎడిటర్స్ గిల్డ్‌ప్రతిపాదనను ఆయన దాదాపు అంగీకరించినట్టు సమాచారం.
దీని ప్రకారం.. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టనున్నారని తెలిసిం ది. ఇదేసమయంలో గుడివాడ ప్రాంతానికి కూడా రామోజీరావుపేరు పెట్టనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతు న్నాయి. రామోజీరావు గుడివాడలో జన్మించారు కాబట్టి.. ఆయనపేరును గుడివాడ నగరానికి పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని పార్టీలో అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంటే.. `రామోజీ-గుడివాడ నియోజకవర్గం` పేరును పరిశీలిస్తున్నట్టు తెలిపాయి. మరి చంద్రబాబు ఈ రూపంలో రుణం తీర్చుకుంటారేమో చూడాలి.
This post was last modified on August 20, 2024 7:52 am
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…