Political News

శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్చేస్తాం: కేటీఆర్‌

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం కోసం సెక్ర‌టేరియ‌ట్ ముందు త‌మ హ‌యాంలో కేటాయిం చిన స్థ‌లంలో రాజీవ్‌గాంధీ విగ్ర‌హాన్ని పెడుతుండ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇలాగే చేస్తే.. తీవ్ర‌ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌ని, తాము మ‌ళ్లీ అధికారం లోకి వ‌స్తామ‌ని.. అప్పుడు తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని తెలిపారు.

శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి ఉన్న రాజీవ్‌గాంధీ పేరును తాము అధికారంలోకి వ‌చ్చాక తీసేస్తామ‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం స్థానంలో ఏర్పాటు చేసే రాజీవ్ విగ్ర‌హాన్ని కూడా తొల‌గిస్తామ‌ని చెప్పారు. గ‌తంలో తాము ప‌దేళ్లు పాలించిన స‌మ‌యంలోనూ కాంగ్రెస్ నాయ‌కుల విగ్ర‌హాల జోలికికానీ.. వారి పేర్ల‌ను మార్చ‌డం కానీ చేయ‌లేద‌న్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం క‌నీస విజ్ఞ‌త లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఖ‌రి ఇలానే ఉంటే.. తాము అధికారంలోకి వ‌చ్చాక శంషాబాద్ విమానాశ్ర‌యానికి రాజీవ్ పేరును తీసేసి పీవీ న‌ర‌సింహారావు, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ లేదా.. తెలంగాణ బిడ్డ‌ల పేర్లు పెడ‌తా మ‌ని చెప్పారు. ఈ మేర‌కు ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు. కాగా, సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ‘‘తెలంగాణ బహుజనుల‌ ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు.

This post was last modified on August 20, 2024 7:24 am

Share
Show comments
Published by
Satya
Tags: KTR

Recent Posts

చరణ్ భుజాల మీద భారతీయుడి బరువు!

మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…

13 minutes ago

వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు

ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…

16 minutes ago

బేబీని టెన్షన్ పెడుతున్న పుష్ప 2?

బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…

1 hour ago

పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు

వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…

1 hour ago

రాహుల్‌తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం

పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…

2 hours ago

శివన్న ఆలస్యం చేస్తే ఆర్సి 16 కూడా లేటే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…

2 hours ago