వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య కుటుంబ వివాదాలు సహా.. రాజకీయ వివాదాలు కూడా ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్న జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఆమె తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. ఈ ప్రభావంతో పాటు ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకత కారణంగా 151 స్థానాలున్నవైసీపీ 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. అయితే.. ఈ వివాదాలకు రాఖీ పండుగతో అయినా.. ఫుల్ స్టాప్ పడతాయని అందరూ అనుకున్నారు. సోమవారం దేశం యావత్తు రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకుంది.
తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్.. తన సోదరిని తలుచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా ఆయనకు సోదరి, ఎమ్మెల్సీ కవిత రాఖీ కడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆమె లిక్కర్ కేసులో చిక్కుకుని తీహార్ జైల్లో ఉండడం తో ఈ అవకాశం లేకుండా పోయింది. దీనిని నేరుగా ప్రస్తావించకపోయినా.. చెల్లితో రాఖీ కట్టించుకోలేక పోయానని మాత్రం కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు చూస్తే.. అన్నా.. చెల్లెళ్లు షర్మిల, జగన్‌లు బాగానే ఉన్నా.. రాఖీ పండుగకు.. వారు కలుసుకోలేక పోవడం.. పైగా షర్మిల అసలు జగన్ ప్రస్తావన లేకుండానే వ్యవహరించడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని షర్మిల చేసిన ట్వీట్‌లో కూడా .. ఎక్కడా సొంత అన్న ప్రస్తావన లేదు. తనతో రక్త సంబంధం లేకపోయినా.. తనను ఆదరిస్తున్న కార్యకర్తలు, నాయకులకు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. `దేవుడు మిమ్మల్ని ఆశీర్వ దించాలని కోరుకుంటున్నా“ అంటూ ఆమె పోస్టు చేశారు. అయితే.. ఈ పోస్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, పార్టీ నాయకురాలు సోనియాగాంధీ, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సహా ఇతర నేతల ఫొటోలను మాత్రమే షర్మిల పోస్టు చేశారు. మాట మాత్రంగా కూడా .. ఎక్కడా జగన్ పేరును కానీ.. ఊరును కానీ.. ప్రస్తావించకపోవడం గమనార్హం. దీంతో వీరి మధ్య వివాదాలు.. విభేదాలు.. రాఖీ పండుగకు కూడా అలుముకున్నాయన్న చర్చ సాగుతోంది.
రెండేళ్లుగా ఇంతే!
గత రెండేళ్లుగా జగన్‌కు షర్మిల రాఖీ కట్టడం లేదు. తాను తెలంగాణ పార్టీ పెట్టడానికి ముందు మాత్రం ఏపీకి వచ్చి జగన్కు రాఖీ కట్టిన ఆమె.. తర్వాత.. మాత్రం ఈ పండుగకు దూరంగా ఉండిపోయారు. ఇదేసమయంలో రాహుల్‌కు మాత్రం శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అన్నా చెల్లెళ్ల మధ్య వివాదాలు విభేదాలు ఇప్పట్లో తీరేలా లేవని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. వైసీపీ అధినేతకు గతంలో రాఖీలు కట్టి సంబరాలు చేసిన పలువురు వైసీపీ నాయకురాళ్లు(రోజా, పుష్ప శ్రీవాణి, సుచరిత పలువురు) ఇప్పుడు సందడి చేయకపోవడం గమనార్హం.
This post was last modified on August 20, 2024 3:25 am
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…