తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేస్తారని.. ఇది ఖాయమని చెప్పారు. ఆ వెంటనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. అంతేకాదు.. పార్టీ పరంగా కూడా మార్పులు ఉంటాయని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోయిన తర్వాత.. ఆ వెంటనే హరీష్ రావుకు అసెంబ్లీలో అప్పోజిషన్ లీడర్ పదవిని అప్పగిస్తారని అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్-బీజేపీ రెండూ ఒక్కటేనని చెప్పారు. “త్వరలోనే మీరు చూస్తారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. ప్రస్తుతం కవిత ఆపశోపాలు పడుతోంది. బెయిల్ రావడం లేదు. విలీనం అయిపోయిన వెంటనే ఆమెకు బెయిల్ వచ్చేస్తుంది. ఆ వెంటనే అప్పోజిషన్ లీడర్‌గా హరీష్‌రావు ఉంటారు. తర్వాత.. కొన్నాళ్లకు కేసీఆర్‌కు గవర్నర్‌కు పదవి దక్కుతుంది. ఇది రాసిపెట్టుకోండి” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వీరిని బీజేపీలోకి పంపించేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే అయిపోయిందన్నారు. త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. కవిత బెయిల్ కోసం.. పార్టీని విలీనం చేస్తున్నారని చెప్పారు. ఇక, కేసీఆర్‌కు గవర్నర్‌కు పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కుతాయని తెలిపారు. ఇవన్నీ పక్కా అని ఉద్ఘాటించారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో రుణ మాఫీ జరిగిందని సీఎం తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తాము రైతులకు రుణ మాఫీ చేశామని అన్నారు. ఇంకా ఎవరికైనా అందకపోతే.. వారికి కూడా ఇచ్చేందుకు మరో 5 వేల కోట్ల రూపాయలను రిజర్వ్ చేసి పెట్టామని తెలిపారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నా రు. అందరికీ రుణమాఫీ చేస్తామని.. ఇచ్చిన మాటకు కట్టుబడతామని చెప్పారు.
This post was last modified on August 16, 2024 4:32 pm
ఒలిపింక్స్ అంటేనే... వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు…
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు.…
పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన…
ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…
ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్,…