ఆట కావొచ్చు.. రాజకీయం కావొచ్చు. గెలుపు ఎంత ఖాయమో.. ఓటమి అంతే పక్కా. గెలుపునకు పొంగిపోవటం.. ఓటమికి కుంగిపోవటం అస్సలు ఉండొద్దు. ఈ విషయాన్ని గుర్తించి.. గెలుపోటముల్నిసమంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తీరుతో ఉన్నప్పుడు ఎదురయ్యే ఓటమిని తేలిగ్గా అధిగమించే వీలుంది. ఈ విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిస్ అవుతున్నారా? అన్నది ప్రశ్న. పంద్రాగస్టు.. జనవరి 26న సంప్రదాయంలో భాగంగా గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించటం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి రాజకీయ రంగం నుంచి సమాజంలోని అన్ని రంగాల వారు హాజరు కావటం తెలిసిందే. ఈసారి ఏపీలో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు.. వివిధ వర్గాలకు చెందిన వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు.నిజానికి ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావటం ద్వారా విమర్శలకు చెక్ చెప్పొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించటం సరికాదు.
ఏపీలో నిర్వహించిన ఎట్ హోంకు ప్రత్యేకత ఏమంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి అధికార పక్షంగా హాజరు కావటం. గతంలోనూ ఆయన ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ..ఎలాంటి అధికారం లేదు. ఈసారి అందుకు భిన్నంగా వంద శాతం స్ట్రైక్ రేటుతో పార్టీ ఎమ్మెల్యేలు.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన ఎట్ హోంకార్యక్రమం దాదాపు గంటకు పైనే సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు.. పలువురు మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు సీనియర్ అధికారులు.. పద్మ పురస్కార గ్రహీతలు.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ఇంతమంది వచ్చినా వైసీపీ అధినేత జగన్ మొదలు ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరూ హాజరుకాకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరు కూడా హాజరు కాకపోవటం సరైన పద్దతి కాదంటున్నారు. గెలుపు ఓటములు మామూలే. అంత మాత్రాన ఓడిన వేళ ఈ తరహా కార్యక్రమాలకు దూరంగా ఉండటం పరిష్కారం కాదన్న విషయాన్ని జగన్ అండ్ కో గుర్తిస్తే మంచిది.
This post was last modified on August 16, 2024 10:57 am
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…