గత వారం రోజుల్లో ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం వ్యవహారం ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు యుక్త వయసుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లను వదిలేసి ఆయన కొన్నేళ్ల కిందట పరిచయం అయిన మాధురితో ఉంటున్నారు. దీనిపై ఆయన భార్యాపిల్లలు గొడవ చేస్తున్నారు.
వాళ్ల మీద శ్రీనివాస్ దాడికి కూడా ప్రయత్నించారు. ఆ తర్వాత ఇరు వైపులా మీడియాకు ఎక్కి వాళ్ల వాళ్ల వెర్షన్ వినిపిస్తున్నారు. మాధురి సైతం మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. ముందు మీడియా ప్రశ్నలకు దీటుగా బదులిస్తూ హుషారుగా కనిపించిన మాధురి.. తర్వాత తన కారును మరో కారుకు గుద్దడం ద్వారా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆ ప్రమాదంలో పెద్దగా గాయాలేమీ కాకుండా బయటపడ్డ మాధురి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో మాధురి ఓ సినిమా కూడా ప్రొడ్యూస్ చేసిందట. ఆ సినిమా పేరు.. వలంటీర్ అని ఆమె వెల్లడించింది. శ్రీనివాస్‌కు సినిమాలంటే ఆసక్తి ఉందని.. ఆయన చక్కగా నటించగలరని ఆమె తెలిపింది. శ్రీనివాస్ మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో నట శిక్షణ కూడా తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. శ్రీనివాస్ ఆసక్తిని గమనించి తానే ఓ సినిమాను ప్రొడ్యూస్ చేశానంది.
తన నిజ జీవిత పాత్రే అయిన రాజకీయ నాయకుడిగా ఆయన ఈ సినిమాలో కనిపించాడంది మాధురి. పూరి జగన్నాథ్ మేనల్లుడు ఇందులో హీరోగా నటించాడని.. కేరళ అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి తక్కువ రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశామని మాధురి వెల్లడించింది.
ఐతే ఎన్నికల హడావుడిలో పడి ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయినట్లు మాధురి చెప్పింది. దువ్వాడ శ్రీనివాస్ పాటలు కూడా బాగా పాడతాడని.. వైసీపీ క్యాడర్‌తో కలిసి తాము రోజూ అంత్యాక్షరి కూడా నిర్వహించేవాళ్లమంటూ.. టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె శ్రీనివాస్ కోసం ‘కరిగిపోయాను కర్పూర వీణలా..’ పాటను పాడి వినిపించడం విశేషం.
This post was last modified on August 15, 2024 4:49 pm
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…