ఏపీకి ఒక బ్రాండ్ ఉందని.. కానీ, గత ఐదేళ్లలో ఆ బ్రాండ్ దెబ్బతిందని.. దీనిని తిరిగి సాధించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. 78వ పంద్రాగస్టు వేడుకలను పురస్కరిం చుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో త్రివర్ణ పతకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగాముందుకు సాగుతామని చెప్పారు.
టార్గెట్ 100!
తమ పాలనలో 100 రోజుల ప్రణాళికను లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని శాఖలను గాడిలో పెడుతున్నట్టు తెలిపారు. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం పక్కా నిర్ణయాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 15% వృద్ధిరేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు జలకళ వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సాగును బాగు చేసేందుకు కూడా తాము కట్టుబడి ఉన్నట్టు చంద్రబాబు తెలిపారు. రైతుల ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. వైసీపీ సర్కారు నిర్వాకం కారణంగా ఉపాధి, ఉద్యోగ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. గత ప్రభుత్వ ఇసుక దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామని ఒక్కరిని కూడా వదిలేది లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఉచిత ఇసుకను మరింతగా పేదలకు చేరువ చేస్తామని చెప్పారు. దీనిపై ఇప్పటికే అనేక రూపాల్లో సమీక్షలు చేశామని అన్నారు. పేదలకు ఇబ్బందిలేని వ్యవస్థను తీసుకురానున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. తప్పు చేసిన వారిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని మాజీ మంత్రి జోగిరమేష్ సహా వైసీపీ నాయకులను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు హెచ్చరిం చారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై మరింతగా దర్యాప్తు చేయిస్తామన్నారు. ఎవరినీ వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు.
This post was last modified on August 15, 2024 4:46 pm
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అరెస్ట్ భయంతో దాదాపుగా అల్లాడిపోయారనే చెప్పాలి. ఫార్ములా…