“నా బీసీలు.. నా ఎస్సీలు” అంటూ.. ఎన్నికలకు ముందు వైసీపీ అధినేతజగన్ ఊదరగొట్టారు. వారికే పద వులు ఇచ్చారు. వారికే టికెట్లు కూడా ఎక్కువగా ఇచ్చారు. ఈ క్రమంలో తనకు కీలకమైన ఓటు బ్యాంకు గా.. ఆర్థిక, రాజకీయ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా దూరంగా ఉంచేశారు. దీంతో వారంతా .. జగన్‌ను నమ్ముకుంటే బూడిదే! అని అనుకుని రాజకీయంగా ఆయనను దూరం పెట్టారు. ఫలితం ఎలా ఉందో ఎన్నికలు చెప్పాయి.
కట్ చేస్తే.. గడిచిన వారంలో రెండు ఘటనలు జరిగాయి. ఈ రెండు ఘటనలు కూడా ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి, రెండోది బీసీ సామాజిక వర్గానికి చెందినవి. ఈ రెండు వర్గాలను నమ్ముకున్న జగన్‌కు.. వాస్తవానికి ఈ రెండు సామాజిక వర్గాలు అండగా ఉంటాయని.. ప్రభుత్వం కూడా భావించింది. పార్టీనాయకులు కూడా అంచనా వేసుకున్నారు. కానీ, అలా ఏమీ జరగలేదు. ఒక్క నాయకుడు కూడా.. రోడ్డెక్కలేదు., ఒక్కరు కూడా జగన్నినాదాలు చేయలేదు. అయ్యో అని కూడా అనలేదు.
1) విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం పాదాల దగ్గర ఏర్పాటు చేసుకున్న సీఎం జగన్ మోహన్‌రెడ్డి అనే పేరును కొందరు దుండగులు తొలగించారు. దీంతో వైసీపీ కన్నెర్ర చేసింది. దీనిని ఎస్సీలపై జరిగిన దాడిగా చూపింది. పెద్ద ఎత్తున ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది. కానీ, ఎవరూ కిమ్మనలేదు. కేవలం వైసీపీ నాయకులు, వైసీపీకి మద్దతిచ్చే కొందరు ఎస్సీలు మాత్రమే స్పందించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన శివాజీ కానీ, ఇతర నాయకులు కానీ స్పందించలేదు.
2) బీసీ నాయకుడు జోగి రమేష్ కుటుంబంపై కేసులు. గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి కుమారుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీనిని అక్రమ అరెస్టుగా వైసీపీ పేర్కొంది. అంతేకాదు.. ఇది బీసీలపై జరిగిన దాడిగా కూడా వివరించింది. ఈ క్రమంలోనే బీసీలే దీనిని ఎదుర్కొనాలని పిలుపుని చ్చింది. కానీ, ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇక్కడ కూడా.. కొందరు అనుకూల నాయకులు.. గతంలో మంత్రి పదవులు పొందిన వారు మాత్రమే స్పందించారు. తప్ప.. ఇంకెవరూ స్పందించకపోవడం గమనార్హం.
This post was last modified on August 15, 2024 11:06 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…