మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. చేస్తున్న వ్యాఖ్యలు.. జనాల్లోకి వెళ్తున్నాయా? అసలు జగన్‌ను జనాలు పట్టించుకుంటున్నారా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలోనే జరుగుతున్న చర్చ. దీనికి కారణం.. నోరు విప్పితే.. చంద్రబాబు పాపాలు పండాయని.. త్వరలోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి జగన్ చెబుతున్నట్టు చంద్రబాబుపై ఎంత వ్యతిరేకత వచ్చినా.. కేవలం రెండు మాసాలు కూడా తిరగకుండానే ఇది సాధ్యమా? అనేది ప్రశ్న.
పోనీ.. ఇదే నిజమని అనుకున్నా.. కూటమికి 164 సీట్లు వచ్చాయి. కాబట్టి ఐదేళ్లు ఖచ్చితంగా పార్టీ అధికా రంలోనే ఉంటుంది. ఒకవేళ.. కూటమిలోనే జగన్ అనుకుంటున్నట్టు కల్లోలం ఏర్పడి.. పార్టీలు విచ్ఛిన్న మైనా.. చంద్రబాబుకే 135 సీట్ల మద్దతు ఉంది. సొంతగా టీడీపీ 135 స్థానాల్లో విజయం దక్కించుకుంది. కాబట్టి.. ఇప్పటికిప్పుడు చంద్రబాబు సర్కారు కూలిపోతుందని.. వైసీపీ వచ్చేస్తుందని చెబుతున్న వ్యాఖ్యల్లో చేస్తున్న కామెంట్లలో ఎక్కడా పస కనిపించడం లేదు.
ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. జగన్ ఇప్పటి వరకు ఈ రెండు మాసాల్లో ఇంటికే పరిమితమయ్యారు. ఒకటి రెండు సార్లు మీడియా ముందుకు వచ్చారు. పైగా ట్విట్టర్‌కే పరిమితం అవుతున్నారు. ఫలితంగా ఆయన వాయిస్ నాలుగు గోడల మధ్యలోనే ఉండిపోతోంది కానీ.. ఎక్కడా బయటకు రావడం లేదు. దీంతో సాధారణ ప్రజల్లో కూడా జగన్ ను మరిచిపోయే ప్రమాదం ఏర్పడింది. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి వస్తుందని.. వచ్చి ఉంటే.. ఇలా ఉండేది కాదని చెబుతున్న వ్యాఖ్యలపైనా జోకులు పేలుతున్నాయి.
నెటిజన్ల ట్రోల్స్ ఎప్పుడూ ఉండేవే. కానీ, సాధారణ జనాలు కూడా నవ్వుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశం. ఎందుకంటే.. అసలు సిసలు ఓటు బ్యాంకు అక్కడే ఉంది. అలాంటి ఓటు బ్యాంకు కూడా జగన్‌వ్యాఖ్యలతో నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఏదైనా చెబితే.. అది ప్రజలు నమ్మేలా ఉండాలి. ప్రజలను నమ్మించేలా అయినా ఉండాలి. కానీ, ఈ రెండు లేకుండా.. కేవలం తన మానాన తను ముందుకు సాగితే ఎలా ? అనేది జగన్ తనను తాను ప్రశ్నించుకోవాల్సిన అంశం.
This post was last modified on August 15, 2024 10:58 am
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…