ఏపీలో చంద్రబాబు కూటమి సర్కారు.. ఇక ఈ-పాలన దిశగా అడుగులు వేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఫిజికల్‌గా తీసుకునే నిర్ణయాలు.. సమీక్షలు, సమావేశాలు ప్రజల సమస్యలను చర్చించేందుకు ఎంతగానో ఉపయోగ పడుతున్నారు. కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు కూడా దోహదపడుతున్నాయి. ఇక, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించేందుకు కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఒక్కొక్కసారి కీలక మంత్రులు అనివార్య కారణాలతో సమీక్షా సమావేశాలకు, మంత్రి మండలి సమావేశాలకు కూడా రాలేక పోతున్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకున్నసీఎం చంద్రబాబు.. ఇప్పుడు ‘ఈ-పాలన’కు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యారు. ఒకవైపు ఫిజికల్ పాలన కొనసాగిస్తూనే.. మరోవైపు.. ఈ-పాలన ద్వారా మరింత మెరుగులు అద్దనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులకు, సీనియర్ అధికారులకు ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు, అధునాతన ఐ-ఫోన్లను కొనుగోలు చేసి ఇవ్వనున్నారు. తద్వారా.. మంత్రులు ఎక్కడ ఉన్నా.. ఈ-సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా వారి శాఖ వివరాలను మంత్రులు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉండనుంది.
ఒక్కొక్కసారి తుఫాన్లు, ఇతర కారణాలతో అధికారులు సైతం కీలక సమావేశాలకు రాలేని పరిస్థితి, సమయం పాటించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని అరికట్టేందుకు కూడా ఈ-పాలన ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాలన అంతా పారదర్శకంగా సాగేందుకు.. అన్ని ఫైళ్లను ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో(అధికారులు-మంత్రులకు) ఉంచనున్నారు. తద్వారా సత్వరమే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. దీనివల్ల పాలనలో వేగం, పారదర్శకత కూడా కనిపిస్తాయన్నది చంద్రబాబు ఆలోచన.
This post was last modified on August 14, 2024 12:32 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…