Political News

దువ్వాడ గొడవ.. మాధురి భర్త లైన్లోకి

గత కొన్ని రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వెల మాధురి అనే పెళ్లయిన మహిళతో సంబంధం గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. తమను వదిలేసి శ్రీనివాస్.. మాధురితో ఉంటుండడంపై ఆయన భార్యాపిల్లలు రోడ్డెక్కి గొడవ చేయడంతో ఈ వ్యవహారం మీడియాలో మార్మోగుతోంది. తామిద్దరు కలిసి ఉంటున్న విషయాన్ని శ్రీనివాస్, మాధురి మీడియా ముందు ఒప్పేసుకున్నారు కూడా.

ఐతే శ్రీనివాస్‌ను భార్యాపిల్లలు రెండేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతోనే మరో మహిళకు దగ్గరయ్యారనే వాదన వినిపిస్తోంది. శ్రీనివాస్, మాధురి ఇదే రకంగా మాట్లాడుతున్నారు. తమ బంధం గురించి వాళ్లు దాచి పెట్టడానికేమీ ప్రయత్నించడం లేదు. ఐతే అమెరికాలో ఉన్న మాధురి భర్త దీనిపై ఏమంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడాయన ఓ టీవీ ఛానెల్‌తో ఈ గొడవ మీద మాట్లాడారు.

మాధురి మీద తనకు నమ్మకముందని.. ఆమె తప్పు చేయదని ఆ ఛానెల్లో మాధురి భర్త స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ఆమెకు అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని ఆయన ఖండించారు. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.

“నాకు ఆర్థిక సమస్యలున్నాయంటే నవ్వొస్తోంది. మా నాన్న గారు లీడింగ్ లాయర్. నాకు నెలకు పది లక్షలు జీతం. ఆ పది లక్షలు మాధురికే పంపిస్తాను. తను మంచి డ్యాన్సర్. తన గురించి ఎందుకింత చెడుగా చెబుతున్నారు. నన్నొక చిన్న బాబులా.. తను తల్లిలా చూసుకుంటుంది. మాధురి గురించి ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను. నేనేం రాముడిని కాదు. ఎవరో ఏదైనా చెబితే వచ్చేయడానికి. ‘కుక్కలు మొరుగుతాయి. మొరగనీ. నాకు నీ మీద నమ్మకముంది’ అనే మాధురికి చెబుతుంటాను. తన గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. నా మాధురి నా మాధురినే దట్సాల్. ఆమెను రాజకీయంగా డౌన్ చేయడానికే ఇలాంటి అభాండాలు వేస్తున్నారు” అని తేల్చేశారు మాధురి భర్త.

ఒక ఇంట్లో తన భర్తతో పాటు మరో మహిళ ఉండడాన్ని దువ్వాడ శ్రీనివాస్ భార్య తప్పుబడుతోంది కదా.. మరి ఈ విషయంలో మీకు అభ్యంతరాలు లేవా అని అడిగితే.. ఒకసారి కరెక్టే కదా అన్న మాధురి భర్త తర్వాత నో కామెంట్స్ అంటూ సైలెంట్ అయిపోయారు.

This post was last modified on August 13, 2024 5:17 pm

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

38 minutes ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

1 hour ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

2 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

2 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

2 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

3 hours ago