చేతిలో ఉన్న అధికారాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. ఎలా ఉంటుందో వైసీపీ ఒక పాఠం. 151 సీట్లు చూసుకుని.. తమకు తిరుగులేదని, తాము ఇస్తున్న పథకాలకు ఎదురు లేదని భావించిన వైసీపీ అధినేత జగన్ తాజా ఎన్నికల్లో తీవ్ర ఎదురు దెబ్బ తిన్నారు. అయితే.. ఈ పరాజయం ఇప్పటితో పోతుందని.. త్వరలోనే పార్టీ పుంజుకునే పరిస్థితి ఉంటుందని వైసీపీలో నాయకులు అంచనా వేస్తుండవచ్చు. జగన్ ఇమేజ్ పెరుగుతుందని కూడా భావిస్తుండవచ్చు.
వారి ఆశావాదాన్ని ఎవరూ కాదనలేరు. అయితే.. ఇక్కడే కొన్ని చిక్కులు చూస్తే.. వచ్చే ఐదేళ్లు కూడా.. పార్టీకి, పార్టీ అధినేత జగన్‌కు కూడా ఆటు పోట్లు తప్పేలా లేవని తెలుస్తోంది. తనపై నమోదైన అక్రమ కేసుల నుంచి జగన్ తప్పించుకునే పరిస్థితి లేదు. ఈ నెల 16 నుంచి తిరిగి ఆ కేసులను రోజువారీ విచారణ జరిపించేలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే.. ఇక, జగన్ పరిస్థితి కేసులు-కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంటుంది.
రాజకీయంగా చూస్తే.. పోతున్నవారెవరో.. ఉంటున్నవారెవరో తెలియని పరిస్థితిలో వైసీపీ తర్జన భర్జన పడుతోంది. పార్టీని కాపాడుకోకపోతే.. మరో ఏడాదిన్నరో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా నేల మట్టం అవుతుంది. ఇది మరింతగా జగన్‌కు ఇబ్బంది. కానీ, పార్టీని పుంజుకునేలా ఆయన ఇప్పటి వరకు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకోలేదు. ఇది మరో సంకట స్థితి. ఇక, వ్యక్తిగతంగా చూసుకుంటే.. ఆయన పై కేసులు నమోదు చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను కూటమి సర్కారు వెతుకుతోంది.
ఇది తప్పుకాదు. చేతకు చేత
అన్నట్టుగా బదులు తీర్చుకోవడమే. గతంలో చంద్రబాబుపై కేసులు తోడి మరీ పెట్టారు. ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. మద్యం విధానం నుంచి టీడీఆర్ బాండ్ల వరకు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా.. రిజిస్ట్రేషన్ అయిన భూముల వరకుకూడా అక్రమాలు జరిగాయన్నది కూటమి సర్కారు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో ఈ కేసులు కూడా జగన్‌కు చుట్టుముట్టే అవకాశం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. వచ్చే ఐదేళ్లు అంత ఈజీ అయితే కాదని.. ఆటు పోట్లు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 12, 2024 4:24 pm
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…
ఇటీవలే సన్నీ డియోల్ జాట్ తో బాలీవుడ్లో అడుగు పెట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాతి సినిమా బాలకృష్ణతో ఉండబోతోంది.…
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…