రాజకీయాల్లో 2014 తర్వాత వచ్చిన కొత్త పోకడ ఇప్పుడు మరింత బలోపేతంగా ముందుకు సాగుతోంది. తమను వ్యతిరేకించే నాయకులు, పార్టీల అధినేతను టార్గెట్ చేసుకోవడం ప్రభుత్వాలు చేసే పని. దీనిని ఎవరూ కాదనరు. అయితే.. ఈ క్రమంలో 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కొత్త పంథాను తెరమీదికి తెచ్చారు. ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు వారికి కల్పించే భద్రతను తగ్గించడం ప్రారంభించారు. ఈ క్రమంలో అనేక వివాదాలు తెరమీదికివచ్చాయి.
కానీ, అధికార పార్టీ మాత్రం తాము చేసింది కరెక్టేనని చెబుతుంది. కానీ, కేంద్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. ప్రత్యర్థులు అయినా.. ఎన్ని విమర్శలు చేసినా.. వారికి నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భద్రతే కాకుండా.. అడిగితే మరింత మందిని ఇస్తున్న సంస్కృతి కూడా ఉంది. భద్రతను రాజకీయాలకు ముడి పెట్టి చూడడం అనేది లేనేలేదు. కానీ, కేసీఆర్‌తో ప్రారంభమైన ఈ జాడ్యం.. తర్వాత.. ఏపీకి కూడా అంటుకుంది. అప్పట్లోనే చంద్రబాబు జగన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. భద్రత విషయంలో మెలిక పెట్టారు.
ఆయనకు ఇచ్చే వాహనాల విషయంలోనూ కుదించారు. దీంతో 2014-19 మధ్య జగన్ హైకోర్టుకు వెళ్లి భద్రత తెచ్చుకున్నారు. ఇక, ఇది తర్వాత కాలంలో జగన్ కూడా అమలు చేశారు. మాజీ సీఎం అయిన చంద్రబాబుకు భద్రతను కుదించారు. ఆయనకు కేంద్రం ఇచ్చి బ్లాక్ క్యాట్ తప్ప.. ప్రభుత్వం పరంగా ఇచ్చే భద్రతను అచేతనం చేశారు. ఇది వివాదం కావడం.. కేంద్రం జోక్యం చేసుకోవడం.. హైకోర్టులో కేసులు దాఖలు తెలిసిందే. చివరకు చంద్రబాబుకు భద్రతను పెంచారు.
ఇక, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా బద్రత కోసం లేఖ రాసే పరిస్థితి, హైకోర్టును ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి తనకు కల్పిస్తున్న భద్రతపై సంతృప్తిగా లేరు. తనకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయితే. ఇది తనకు సరిపోదని.. గతంలో తనకు ఉన్న 139 మంది సిబ్బందిని ఇవ్వాలన్నది జగన్ వాదన. కానీ, సర్కారు దీనికి ఒప్పుకోవడం లేదు. ఎలా చూసుకున్నా.. వ్యక్తుల భద్రత కూడా రాజకీయంగా మారిపోవడం గమనార్హం.
This post was last modified on August 12, 2024 6:40 am
సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం..…
రెండున్నర గంటలు అండర్ కవర్ ఆపరేషన్ చేసి సినిమా చివర్లో ట్విస్ట్ ఇచ్చే హీరోలాగా పండగ బరిలో లాస్ట్ వచ్చిన…
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)…
క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…
అప్పుడెప్పుడో...2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై…
ఇంకో రెండు రోజుల్లో పుష్ప 2 ది రూల్ రీ లోడెడ్ వెర్షన్ ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ తో…