Political News

ఏపీ లో యూట్యూబ్ అకాడ‌మీ: చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే

ఏపీలో చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ స్థాయి కంపెనీలు ఒక్కొక్క‌టిగా ఏపీకి వ‌స్తున్నాయి. దీనిలో భాగంగా అమెరికాకు చెందిన‌ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత యూట్యూబ్ సంస్థ‌.. ఏపీలో అకాడ‌మీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. వాస్త‌వానికి చంద్ర‌బాబే ఆహ్వానించారు.

దీంతో ఆ సంస్థ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీ హెడ్ సంజయ్ గుప్తాలు దీనికి సుముఖత వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో సీఎం చంద్రబాబు వారితో వ‌ర్చువ‌ల్‌గా భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన ప్రాధాన్యాల‌ను ఆయ‌న వారికి వివ‌రించారు.

స్థానికంగా కొంద‌రు జ‌త క‌లుస్తార‌ని.. వారితో క‌లిసి అకాడ‌మీని ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబు వారికి సూచించారు. దీనిలో ప్ర‌ధానంగా బీటెక్ చ‌ద‌విన విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు.. కంటెంట్, స్కిల్ డెలవప్‌మెంట్, ఏఐ, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వంటి వాటిపై శిక్ష‌ణ‌, ప‌రిశోధ‌న‌ల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు తెలిపారు.

అమ‌రావ‌తిలోని న‌వ‌న‌గ‌రాల్లో ఒక‌టైన ‘మీడియా సిటీ’లో యూట్యూబ్ అకాడ‌మీని ఏర్పాటు చేయాల‌ని కోరారు. కంటెంట్ రైట‌ర్ల ను ప్రోత్స‌హించ‌డం ద్వారా ఉపాధి క‌ల్పించే అవ‌కాశాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు. క్వాలిటీ కంటెంట్ ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయ‌డం ద్వారా.. ఆదాయ మార్గాలు ఉన్న విష‌యాన్ని తెలిపారు.

అదేవిధంగా వీడియోలు, ఆడియోల రూప‌క‌ల్ప‌న‌, క్వాలిటీని మెరుగు ప‌రుస్తూ.. విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. గూగుల్ తో అనుసంధానం చేసుకుని.. యూట్యూబ్ అకాడ‌మీ కార్య‌క్ర‌మాలు రూపొందించాల‌ని సూచించారు. ఏపీలో నైపుణ్యం ఉన్న మాన‌వ వ‌న‌రులు ఉన్నాయ‌ని.. వారిని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం కోరారు.

ప్రభుత్వ వైపు నుంచి కూడా అప‌ర‌మిత సాయం అందుతుంద‌ని.. మౌలిక స‌దుపాయాలు అందిస్తామ‌ని తెలిపారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫా బెట్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఉన్న విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఈ నేప‌థ్యంలో ఏపీలో యూట్యూబ్ అకాడ‌మీని ఏర్పాటు చేయ‌డం ద్వారా ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు వ‌స్తార‌ని వివ‌రించారు. దీనికి సీఈవోలు అంగీక‌రించారు.

This post was last modified on August 6, 2024 10:08 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

52 minutes ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

1 hour ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

1 hour ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

2 hours ago

డాలర్‌ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!

రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…

2 hours ago

కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?

బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…

3 hours ago