Political News

పులివెందుల ఎమ్మెల్యే’కు భ‌ద్ర‌త పెంచ‌లేం..

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధిన‌త జ‌గ‌న్‌కు ప్ర‌స్తుతం ఉన్న భ‌ద్ర‌త‌ను పెంచలేమ‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనికి సంబం దించి జ‌గ‌న్ హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు గ‌తంలో 139 మందితో భ‌ద్ర‌త ఉంద‌ని.. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత క‌నీసం ఎలాంటి స‌మాచారం లేకుండానే వీరిలో స‌గం మందిని వెన‌క్కితీసుకుంద‌ని ఆయ‌న పిటిష‌న్‌లో వివ‌రించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఒక రోజు ముందు త‌న‌కు ఉన్న భ‌ద్ర‌త‌ను పున‌రుద్ధ‌రించాల‌ని.. ఆయ‌న హైకోర్టును అభ్య‌ర్థించారు. అదేవిధంగా త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని కూడా తెలిపారు.

ఈ ప‌రిణామాల‌పై ప్ర‌భుత్వంలోని ప‌లువురు స్పందించారు. జ‌గ‌న్‌కు ఇంత‌కు మించిన భ‌ద్ర‌త క‌ల్పించ‌లేమ‌ని తెగేసి చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌స్తుత పొజిష‌న్ కేవ‌లం పులివెందుల ఎమ్మెల్యే మాత్ర‌మేన‌ని మంత్రి కొల్లు ర‌వీంద్ర వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌లేద‌ని, ప్ర‌జ‌లు కూడా ఇవ్వ‌లేద‌ని.. దీనిని బ‌ట్టి ఆయ‌న సాధార‌ణ ఎమ్మెల్యేనేన‌ని.. అయిన‌ప్ప‌టికీ.. దాదాపు 70 మందితో భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. ఒక సాధార‌ణ ఎమ్మెల్యేకు ఇంత‌కు మించిన భ‌ద్ర‌త ఏ రాష్ట్రంలోనూ క‌ల్పించ‌డం లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఇస్తున్న భ‌ద్ర‌త‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ పెంచేది లేద‌న్నారు.

మ‌రో మంత్రి రాంప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌కు ఎలాంటి ప్రాణ హానీ లేద‌న్నారు. పైగా 100 అడుగుల ఇనుప కంచెను ఏర్పాటు చేసుకుని, సుస్థిర భ‌ద్ర‌త‌తో కూడిన తాడేప‌ల్లి ప్యాలెస్‌లో ఉంటున్న జ‌గ‌న్‌కు ఎలాంటి భ‌యం ఉంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు కూడా ద‌రి దాపుల్లోకి రాకుండా నాలుగు అంచెల భ‌ద్ర‌త‌ను ఆయ‌న నివాసంలో కొన‌సాగిస్తున్నా ర‌ని.. ప్రైవేటు సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నార‌ని.. ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వ‌స్తే.. ప్ర‌భుత్వం 70మందితో ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంద ని మంత్రి చెప్పారు. ఇవి కాకుండా స్థానిక పోలీసులు ఎప్పుడూ భ‌ద్ర‌తగా ఉంటార‌ని తెలిపారు. జ‌గ‌న్ అత్యాస‌కు పోతున్నార‌ని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ప్రాణాల‌కు ఎలాంటి ముప్పు లేద‌ని.. ఏదైనా ఉంటే త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త‌ను పెంచుతామ‌ని.. ఇంకో మంత్రి ఆనం రామ‌ నారా యణ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల నేత‌గా త‌న‌కు తాను చెప్పుకొనే జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వ‌చ్చేందుకు భ‌య‌ప‌డుతు న్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం ఆయ‌న‌కు మొహం చెల్ల‌డం లేద‌ని.. అందుకే భ‌ద్ర‌త పేరుతో ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉండాల‌నే వ్యూహాన్ని అమ‌లు చేసుకున్న‌ట్టు తెలుస్తోంద‌న్నారు. గ‌తంలో చంద్ర‌బాబుకు రాష్ట్ర పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించ‌క‌పోయినా.. ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన విష‌యాన్ని జ‌గ‌న్ గుర్తుంచుకోవాల‌ని సూచించారు.

This post was last modified on August 6, 2024 10:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

17 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago