వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రశ్నించకూడదన్న ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, అందుకే అందరినీ భయ పెట్టి పాలన చేస్తు న్నారని మండిపడ్డారు. ఇదే కొనసాగితే.. చంద్రబాబు సహా కూటమి ప్రభుత్వం బంగాళా ఖాతంలో కూలిపోవడం ఖాయమనం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు భయపెట్టి పాలన సాగించాలని అనుకుంటున్నాడు. ఇదే చేస్తే.. ఇలాంటి పనులే కొనసాగిస్తే.. చంద్రబాబును, టీడీపీని కూడా ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసే పరిస్థితులు వస్తాయి అని జగన్ అన్నారు.
సీఎం చంద్రబాబుపై ప్రజల్లో విరక్తి ఏర్పడిందని జగన్ వ్యాఖ్యానించారు. సహజంగా ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేందుకు కొంత సమయం పడుతుందని… కానీ, చంద్రబాబుసర్కారుపై ప్రజల్లో అత్యంత స్వల్ప కాలంలోనే విరక్తి వచ్చిందని జగన్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఊరూ వాడా టముకేసి మరీ చెప్పిన పథకాలను చంద్రబాబు ఇప్పుడు మరిచిపోయాడన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం వంటి పథకాలను ఆయన ఎప్పుడో మరిచిపోయాడని, దీంతో రైతులు, విద్యార్థుల తల్లులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మంగళవారం విజయవాడకు వచ్చిన జగన్.. ఇక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తను ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్నారని.. భయపెడుతున్నారని చెప్పారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం తప్పుడు సంప్రదాయమని జగన్ చెప్పారు. దీనిని తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. రాష్ట్రంలో సాధారణ ప్రజలు జీవించలేని పరిస్థితులు వచ్చాయన్న ఆయన.. శాంతి భద్రతలు ఎక్కడున్నాయని నిలదీశారు. వైసీపీ కార్యకర్తలు సహా మహిళలపైన కూడా అఘాయిత్యాలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు.
దేశవ్యాప్తంగా ఆందోళన
రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపైనా.. దాడులపైనా దేశవ్యాప్తంగా ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు జగన్ చెప్పారు. ఇటీవల నంద్యాలలో దారుణ హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై తాను హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడతామని జగన్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న మారణ కాండపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates