Political News

ప‌నిలేదు.. కానీ.. స్కోపుంది.. జ‌గ‌న్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ‌డిచిన‌ రెండు నెలల(జూన్ 4 – ఆగ‌స్టు 4) కాలంలో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అయితే అసలు చేయడానికి పని లేదా? అంటే చాలానే ఉంది. కానీ జగన్ పట్టించుకోవడం లేదు. దెబ్బతిన్న పార్టీని గాడిన పెట్టడం, అదేవిధంగా కొంతమంది నాయకులు వెళ్లిపోతారని భావిస్తున్న నేపథ్యంలో వారిని బుజ్జ‌గించ‌డం చేయాలి.

అంతేకాదు, వారిని తన వైపు తిప్పుకోవడంతోపాటు త‌న‌పై విశ్వాసాన్ని మ‌రింత పెంచేచ‌ర్య‌లు తీసుకోవా లి. అలానే పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఈ విషయాలను జగన్ పట్టిం చుకుని కూడా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పార్టీలోనే చర్చగా మారింది. పార్టీ ఇలానే ఉంటే తమ దారి తాము చూసుకుంటాం అన్న విధంగా చాలామంది నాయకులు సంకేతాలు పంపిస్తున్నారు. ఆన్లైన్ ఛానళ్లు, సోషల్ మాధ్యమాల రూపంలో వైసిపి నాయకులు ఈ విధమైన సంకేతాలను పంపిస్తున్నారు.

ఇది పార్టీని ముందు ముందు ఇబ్బంది పెట్టడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. తనకు ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉందని చెబుతున్నప్పటికీ దీనిని కాపాడుకునేందుకు, ప్రజల్లో నిరంతరం ఉండేందుకు వేస్తున్న ప్లాన్లు కూడా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌ ఎక్కడా కనిపించట్లేదు. పైకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని చెబుతున్నా అంతర్గతం గా మాత్రం ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకునే విధంగా జగన్ ప్రయత్నాలు పెరిగిపోవడం గమనార్హం. ఉదాహరణకు రాయలసీమ వంటి జిల్లాల్లో వైసిపి ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఉన్న నాయకులు కూడా కేసుల భయంతోనో లేక ఇతర కారణాలతో అధికార పార్టీ వైపు ఇప్పటికే ముగ్గు చూపారు.

అంతర్గతంగా తమకు ఉన్న పరిచయాలు, తమకు ఉన్న మాధ్యమాల ద్వారా కూటమి ప్రభుత్వంలోని నాయకులతో వాళ్ళు కలిసి నడుస్తున్నారు. దీనిని కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు జగన్ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయడం లేదు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో చాలామంది కార్పొరేటర్లు జనసేన వైపు మొగ్గు చూపారు. చిత్తూరులో అయితే ఏకంగా కార్పొరేషన్ మొత్తం కూటమి ప్రభుత్వం వైపు వెళ్ళిపోయింది. మరి ఎప్పటికైనా జగన్ స్పందిస్తారా లేక తాడేపల్లి ప్యాలెస్‌ కే పరిమితం అవుతారా అనేది చూడాలి.

This post was last modified on August 6, 2024 11:59 am

Share

Recent Posts

మేన‌మామ ఉంగ‌రం విలువ 750 కోట్లు

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌కు త‌మిళ‌నాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జ‌య‌ల‌లిత, క‌రుణానిధి ప్ర‌భుత్వాల నుంచి నేటి…

52 minutes ago

దుమారం రేపిన ద‌ర్శ‌కుడి తండ్రి ఇంట‌ర్వ్యూ

త‌మిళంలో పేరున్న ద‌ర్శ‌కుల్లో వెంక‌ట్ ప్ర‌భు ఒక‌రు. చెన్నై-28తో మొద‌లుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివ‌ర‌గా విజ‌య్ హీరోగా గ్రేటెస్ట్…

1 hour ago

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

1 hour ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

2 hours ago

డైరెక్ట‌ర్ ఏడిస్తే… హీరోనే డైరెక్ట్ చేసుకున్నాడ‌ట‌

కొన్నిసార్లు ద‌ర్శ‌కులు క‌థ చెప్పినంత బాగా సినిమా తీయ‌లేక‌పోతుంటారు. అందుకు అనుభ‌వ లేమి కూడా కార‌ణం కావ‌చ్చు. లేదంటే రాత…

2 hours ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

2 hours ago