రాజకీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా వారి మాట కూడా వినిపించడం లేదు. ఎన్నికలకు ముందు కూడా తొడగొట్టి సవాళ్లు రువ్విన కొందరు నాయకులు.. మీసం మెలేసి సవాళ్లు చేసిన మరికొందరు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, రోజా, కొడాలి నాని, జోగి రమేష్, విడదల రజనీ సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ వంటి పలువురు ఉన్నారు.
అయితే.. ఇప్పుడు వారు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం.. ఏం మాట్లాడితే ఏం కేసు పెడత రోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో కేడర్ కూడా వీరికి దూరంగా ఉంది. ఒకప్పుడు అనిల్ తాలూకా అని చెప్పుకొన్న చాలా మంది నాయకులు, వ్యాపారులు ఇప్పుడు ఆయన పేరును మరిచిపోయారు. అబ్బే.. ఆయనతో మాకు పెద్దగా సంబంధాలు లేవు. ఎన్నికలకు ముందే తెంచేసుకున్నాం.. అని నెల్లూరులో చెబుతున్నారు.
ఇక, కొడాలి నాని వర్గం అయితే.. కకావికలం అయిపోయింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు … అన్నట్టుగా నాయ కులు పారిపోయారు. వీరిని కూడా కేసలు భయం .. ముఖ్యంగా కేసినో భయం వెంటాడుతోంది. అందుకే కేడర్ డర్ ఫీలవుతున్నారు. ఇక, జోగి రమేష్ అయితే.. తను సైలెంట్ కావడంతోపాటు.. తన వారిని కూడా సైలెంట్ చేశారు. విడదల రజనీ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఆరోగ్య శ్రీ పథకంపై విమర్శలుచేసినా.. తర్వాత.. మౌనంగా ఉండిపోయారు. రోజా గుళ్ల చుట్టూ తిరుగుతూ.. పాపాలు పోయేందుకు పూజలు చేయిం చుకుంటున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏపీ రాజకీయాల్లో ఫైర్ రేపిన ఫైర్ బ్రాండ్లు అందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. పైగా మరో రెండేళ్ల వరకు కూడా వారు లైన్‌లోకి వచ్చే అవకాశం లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఏ చిన్న విషయంలో వారు బయటకు వచ్చినా.. ఇబ్బందేనని వారి అనుచరులే చెబుతున్నారు. వాస్తానికి నెల రోజులతర్వాతయినా బయటకు వస్తారని ఆశించినా.. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ధాటికి వీరంతా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కొందరు పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఇదీ సంగతి!!
This post was last modified on August 6, 2024 11:16 am
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…