ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లకు షాకిచ్చారు. ఆయన మాట్లాడిన తీరు.. ఆయన చెప్పిన విషయాలు విని 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి కారణం.. గత ఐదేళ్లలో వారు ఎన్నడూ వినని.. ఎప్పుడూ ఊహించని విధంగా నిర్ణయాలు.. సూచనలు.. దిశానిర్దేశాలు ఉండడమే. ఉదాహరణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మాట 2014-19 తర్వాత.. మళ్లీ ఎప్పుడూ రాష్ట్రంలో వినిపించలేదు. మళ్లీ ఇప్పుడే చంద్రబాబు నోటి నుంచి ఆ మాట వినిపించింది.
పెట్టుబడులు పెట్టేవారికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని మళ్లీ తీసుకువస్తున్నామని చంద్రబాబు చెప్పారు. దీంతో కలెక్టర్లు మరోసారి పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో చంద్రబాబు వ్యవహార శైలి వంటి వాటిని వారు మననం చేసుకున్నారు. అలాగే.. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కలెక్టర్ల పనితీరును అంచనా వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇది కూడా వారు ఊహించని పరిణామం. నిజానికి గత 2019-24 మధ్య కాలంలో పనితీరును అంచనా వేసే విధానం వేరేగా ఉండేది.
తాము చెప్పిన నిర్ణయాలు అమలు చేసేవారిని అందలం ఎక్కించడం.. తమ నిర్ణయాల్లో చెడుగును గుర్తించి అలెర్ట్ చేస్తే.. వెంటనే పక్కన పెట్టడం వంటివి సునాయాశంగా జరిగిపోయాయి. దీంతో పనితీరు అంటే.. భజన చేయడమేనన్న వాదన తెరమీదికి వచ్చింది. ఇక, ఇప్పుడు అలాంటి భజనలకు అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో నిర్దిష్టంగా కలెక్టర్లు పనిచేసేందుకు.. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య వారధుల్లా నిలిచేందుకు అవకాశం ఏర్పడింది.
ఈ పరిణామం కూడా.. కలెక్టర్లను పాత రోజుల్లోకి తీసుకు వెళ్లింది. అలాగే.. పీపీపీ, పీ-4 వంటి అంశాలను ప్రస్తావించినప్పుడు కూడా కలెక్టర్లు.. గత చంద్రబాబు పాలనను మననం చేసుకున్నారు. వైసీపీ హయాం లో ఇలాంటి పదాలు కానీ.. ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఎక్కడా వారికి వినిపించలేదు. కనిపించలేదు. మరీ ముఖ్యంగా 1995 నాటి సీఎంను చూస్తారు.. అని చంద్రబాబు వ్యాఖ్యానించినప్పుడు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పనితీరును ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు.. కలెక్టర్లను ముందుకు నడిపిం చడంలోనూ అప్పట్లో చంద్రబాబు దూకుడుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని చెప్పడంతో కలెక్టర్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on August 5, 2024 10:31 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…