బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నిర్లిప్తంగా ఉన్నారా? ఏ పని అడిగినా.. నా చేతుల్లో ఏమీలేదని సెలవిస్తున్నారా? తన పనేదే తాను చూసుకుని వెళ్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు బీజేపీ నాయకులు. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ చేతులు కలిపి.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం పంచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పురందేశ్వరి పలుకుబడి పెరుగుతుందని అందరూ అనుకున్నారు.
పైగా.. కూటమి ప్రభుత్వమే కావడం.. ఒక మంత్రి పదవిని కూడా రాష్ట్రంలో తీసుకున్న నేపథ్యంలో బీజేపీకి సానుకూల పరిణామాలు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించారు. దీంతో ఏ పనికావాలన్నా.. ముందు పురందేశ్వరికి చెబుతున్నారు. సాధారణంగా.. రాష్ట్రంలో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని పంచుకున్న నేపథ్యంలో ఆమె చెబితే తమకు పనులు అవుతాయని అందరూ భావించడంలో తప్పులేదు. కానీ, ఆమె మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తనవద్దకు వచ్చేవారిని తిరుగు టపాలో వెనక్కి పంపిస్తున్నారు.
“నా చేతుల్లో ఏమీ లేదు. పైవాళ్లను కలవండి. అధిష్టానం దగ్గరకు వెళ్లండి” అంటూ ఢిల్లీ అడ్రస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం జరుగుతోంది. పైకి అందరూ సైలెంట్‌గానే ఉన్నా.. ఎక్కడికక్కడ నాయకులు తెరచాటుగా.. తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు బీజేపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న మాట వాస్తవం. అయితే.. ఎలానూ రాష్ట్ర చీఫ్ కాబట్టి పురందేశ్వరిని ఆశ్రయిస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం ఢిల్లీ అడ్రస్ చెబుతూ.. కాలం వెళ్ల దీస్తున్నారు.
దీనికి కారణం ఏంటి? ఎందుకు? అని చూస్తే.. తనకు కేంద్రంలో ప్రాధాన్యం దక్కలేదని పురందేశ్వరి ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని.. ఇస్తారని ఆమె ఆశలు పెట్టుకు న్నారు. కానీ, ఆమెకు ఇవ్వకుండా నరసాపురం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న భూపతి రాజు కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, రాష్ట్రంలోనూ తన నిర్ణయాలతో సంబంధం లేకుండా.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీంతో రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాల విషయంలోనూ.. కేంద్రం తీసుకునే నిర్ణయాల విషయంలోనూ తన ప్రమేయం లేకపోవడంతో దీనిని అవమానంగా ఫీలవుతున్నారని పురందేశ్వరి గురించి బీజేపీలో ఒక చర్చ సాగుతుండడం గమనార్హం. అందుకే వచ్చిన వారికి వచ్చినట్టు ఢిల్లీ అడ్రస్ చెబుతున్నారట. తన చేతుల్లో ఏమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారట. ఇదీ.. సంగతి!!
This post was last modified on August 5, 2024 3:07 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…